
Road accident in Nellore: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
కారులో ప్రయాణిస్తున్నవారు నారాయణ మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న ఆరుగురు వైద్య విద్యార్థులు. వారు బుచ్చిరెడ్డిపాలెం వద్ద స్నేహితుడి అక్క నిశ్చితార్థ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్ లు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.