నంద్యాలలో బాలయ్య ప్రచారం

Published : Aug 11, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నంద్యాలలో బాలయ్య ప్రచారం

సారాంశం

ఈనెల 13వ తేదీన నంద్యాలలోని బాలకృష్ణ అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. బాలకృష్ణ పర్యటన కూడా అదే రోజు నుండి మొదలవుతుందని టిడిపి నేతలంటున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో నందమూరి బాలకృష్ణ ప్రచారానికి వస్తున్నారు. అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా బాలయ్య ప్రచారం చేస్తే మంచి ఊపు వస్తుందని పార్టీ వర్గాలు కూడా అటు చంద్రబాబునాయుడు ఇటు బాలకృష్ణకు కూడా చెప్పాయట. దాంతో బాలయ్య పర్యటన ఖారారైందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదే విషయమై ఈనెల 13వ తేదీన నంద్యాలలోని బాలకృష్ణ అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. బాలకృష్ణ పర్యటన కూడా అదే రోజు నుండి మొదలవుతుందని టిడిపి నేతలంటున్నారు.

అయితే, బాలయ్య పర్యటనను ఎవరూ ధృవీకరించ లేదు. ఎందుకంటే, ఈనెల 18 నుండి చంద్రబాబు నంద్యాలలో క్యాంపు వేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. అంతకుముందుగానే రెండు, మూడు రోజుల పాటు బాలయ్యను నంద్యాలలో పర్యటనకు వచ్చేట్లు చేయాలని పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రచారానికి రావటానికి బాలయ్య కూడా అంగీకరించారని నేతలు చెబుతున్నారు. అయితే,  తేదీలే ఇంకా తేలలేదు.

PREV
click me!

Recommended Stories

Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu