presidential election 2022 : జూలై 4న ఏపీకి ద్రౌపది ముర్ము.. జగన్ , చంద్రబాబును కలిసే ఛాన్స్..?

Siva Kodati |  
Published : Jun 23, 2022, 05:55 PM ISTUpdated : Jun 23, 2022, 05:56 PM IST
presidential election 2022 : జూలై 4న ఏపీకి ద్రౌపది ముర్ము.. జగన్ , చంద్రబాబును కలిసే ఛాన్స్..?

సారాంశం

ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము జూలై 4న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మద్ధతు కోరనున్నారు ద్రౌపది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిసే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.    

ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము జూలై 4న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మద్ధతు కోరనున్నారు ద్రౌపది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిసే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీని (narendra modi) మర్యాదపూర్వకంగా కలిశారు (nda president candidate) ద్రౌపది ముర్ము (draupadi murmu) . ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను (amit shah) కూడా ద్రౌపది కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ఆమె రేపు నామినేషన్ వేయనున్నారు. ఇకపోతే.. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయడాన్ని భారత సమాజంలోని అన్ని వర్గాలు మెచ్చుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆమె మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంగళవారం సాయంత్రం తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు దేశ అత్యున్నత పదవికి మాజీ ఆర్థిక మంత్రి అయిన యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా (yashwant sinha) మాట్లాడుతూ.. రాష్ట్రపతి రేసులో ఉన్న ద్రౌపది ముర్ముపై తనకు ఎంతో గౌరవం ఉందని, అయితే పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, వ్యతిరేక భావజాలాల మధ్య పోరు అని అన్నారు. గత ఏడాది మార్చిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి వైదొలిగి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో చేరిన సిన్హా  ముర్ముకు ఎన్నికలలో శుభాకాంక్షలు తెలిపారు.

ALso REad:Draupadi Murmu : స్వ‌యంగా ఆల‌య ప్రాంగణాన్ని ఊడ్చి, పూజ‌లు చేసిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థి ద్రౌపది ముర్ము

తొలిసారి గిరిజన అభ్యర్థిని గెలిపించాలంటూ త‌న‌పై ఒత్తిడి తెస్తున్న వారికి, దేశ దిశను సరిదిద్దే విషయానికి వస్తే.. ఈ సమస్యలు చిన్నబోతాయని వారికి చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా.. తమకు అనుకూలంగా ఉండే నాయకులపై ఒత్తిడి తేవాలని దేశ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నానని యశ్వంత్ సిన్హా అన్నారు. వ్యతిరేక భావజాలాల గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. ఒకరు రాజ్యాంగాన్ని అడ్డుకోవడంలో నరకయాతన పడుతున్నారని, దేశ అధ్యక్షుడికి పని చేయడానికి తన స్వంత మనస్సు ఉండకూడదని, రబ్బర్ స్టాంప్‌గా పనిచేయాలని నమ్ముతున్నాడని అన్నారు.  రాజ్యాంగాన్ని, గణతంత్రాన్ని కాపాడాలని నిశ్చయించుకున్న ఇతర భావజాలానికి చెందినందుకు తాను గర్వపడుతున్నానని సిన్హా అన్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల కోసం అన్ని ప్రతిపక్ష పార్టీల త‌న‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంద‌నీ, తనపై విశ్వాసం ఉంచిన ప్ర‌తిప‌క్ష‌ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.  తాను రాష్ట్ర‌ప‌తిగా ఎన్నుకోబడినట్లయితే.. భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక విలువలు, మార్గనిర్దేశక ఆలోచనలకు నిర్భయంగా లేదా పక్షపాతం లేకుండా మనస్సాక్షికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి తాను రాజ్యాంగ పరిరక్షకుడిగా, కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని మసకబార‌కుండా చూసుకుంటాన‌ని అన్నారు. అలాగే.. ప్రజాస్వామ్య సంస్థల యొక్క స్వాతంత్య్రం, సమగ్రతను కాపాడుతాన‌నీ, వాటిని ఆయుధంగా మార్చడానికి తాను అనుమతించనని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం