MP Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. ఎంపీ రఘురామ రియాక్షన్

By Mahesh KFirst Published Jan 16, 2024, 2:38 PM IST
Highlights

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. రెగ్యులర్ బెయిల్ ఉన్నందున చంద్రబాబుకు ఈ తీర్పుతో ఇబ్బందేమీ లేదని వివరించారు. పూర్తిస్థాయి తీర్పు వస్తే బాగుండని తెలిపారు. బెబ్బులిపులి సినిమాలోలాగా కోర్టుకు కోర్టుకు తీర్పు మారుతుంటాయని వివరించారు.
 

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసును క్వాష్ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు కేసులో 17ఏ సెక్షన్ వరిస్తుందని, ఒకరు వర్తించదని మరొక న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని వివరించారు. రెండు తీర్పులు విడిగా ఇచ్చారని వివరించారు. కాబట్టి, ఈ కేసు ద్విసభ్య బెంచ్ నుంచి త్రిసభ్య ధర్మాసనానికి నివేదించినట్టు తెలిపారు.

ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని ఎంపీ రఘురామ చెప్పారు. ఈ త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడానికి కనీసం మరో ఆరు నెలల పట్టే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సమయం చంద్రబాబు నాయుడు పెద్దగా ఇబ్బంది పెట్టదని, ఎందుకంటే ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని కాబట్టి సమస్యేమీ కాదని వివరించారు.

Latest Videos

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీతోపాటు ఆ బస్‌లో ప్రయాణించాలనుకుంటున్నారా? ఇలా ప్రయత్నించండి

బెబ్బులిపులి సినిమాలో కోర్టుకు కోర్టు తీర్పు మారుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశిద్దామని రఘురామ తెలిపారు. ఈ తీర్పు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగానైతే రాలేదని చెప్పారు. కాబట్టి, సంబరాలు చేసుకున్నా తప్పులేదని పేర్కొన్నారు. కానీ, పూర్తిస్థాయి తీర్పు వస్తే ఇంకా బాగుండేదని వివరించారు. 

click me!