
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణతో పోలిస్తే ఈ వేడుకలు ఏపీలో ఇంకా ఎంతో ఉత్సాహంగా జరపుకుంటారు. ఈ పండగ కోసం దేశ, విదేశాల్లో చదువు కోసం, ఉద్యోగాల కోసం ఎక్కడ సెటిల్ అయిన వారైనా సొంతూర్లో వాలిపోతారు. అందుకే ఇక్కడ ఈ సారి కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏ ఊర్లోకి వెళ్లిన పిండి వంటలు, ఇంటి ముందు అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, సరదాలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు.. అబ్బో ఒక్కటేమెటి.. ఈ వేడుకలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..
కోళ్ల పందేలు, గాలి పటాలు ఎగురవేయటాలు, భోగి మంటల, వాటి చుట్టూ డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. గుంటూరులోని సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు పాటలకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మరో ఉన్నతాధికారి ఈ సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేసి ఔరా అనిపించారు.
నర్సరావు పేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అక్కడి నిర్వాహకులు కలెక్టర్ ను స్టేజీపైకి ఆహ్వానించారు. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం హోస్ట్ లో అక్కడ పాటలకు డ్యాన్స్ లు చేశారు. కలెక్టర్ ను కూడా డ్యాన్స్ చేయాలని కోరారు. దీంతో ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఆయన వేసిన స్టెప్పులు ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏ మాత్రం తీసిపోవు.
గోదారోళ్ల మర్యాదలే వేరు.. కొత్త అల్లుడికి 200 రకాల వంటలతో విందు.. వైరల్
మరో పాటకు కూడా ఆయన డ్యాన్స్ చేసి, అక్కడ సంబరాన్ని రెట్టింపు చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉండే కలెక్టర్ ఇలా ఉల్లాసంగా స్టెప్పులు వేయడంతో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈలలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.