ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వై.ఎస్. షర్మిలకు: సీడబ్ల్యూసీలోకి గిడుగు

By narsimha lode  |  First Published Jan 16, 2024, 2:34 PM IST

 కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలిగా  వై.ఎస్. షర్మిలను ఆ పార్టీ నియమించింది. 


అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిలను  నియమించారు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా  గిడుగు రుద్రరాజును నియమిస్తూ  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Latest Videos

undefined

  ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి కే.సీ . వేణుగోపాల్  మంగళవారంనాడు  ప్రకటన విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు  ఈ నెల  15నే రాజీనామా చేశారు. ఆ మరునాడే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వై.ఎస్. షర్మిలకు అప్పగిస్తూ  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

వైఎస్ఆర్‌టీపీని ఈ నెల  4వ తేదీన వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అదే రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2023 అక్టోబర్ చివర్లోనే  కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయాలని  షర్మిల భావించారు. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ జరిగింది. 

also read:సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు: బాబు పిటిషన్ సీజేఐకి బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే  వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. 2014 నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో  కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా నష్టపోయింది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత  తెలంగాణలో  2023  నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  ఈ ఎన్నికల్లో కనీసం  15 శాతం ఓట్లు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు వెళ్తుంది.  ఈ క్రమంలోనే  షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్. షర్మిల సోదరుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీతో విబేధించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ  (వైఎస్ఆర్‌సీపీ)  ని  జగన్ ఏర్పాటు చేశారు.2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది.  

 


 

click me!