హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ల నమ్మకాలను ఇది తీవ్రంగా గాయపరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే.. వారు సమగ్రంగా చర్చించేందుకు వీలుండదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా.. 146 జీవీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురౌతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్పచుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ల నమ్మకాలను ఇది తీవ్రంగా గాయపరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే.. వారు సమగ్రంగా చర్చించేందుకు వీలుండదన్నారు.
సాధారణంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ , కమిషనర్ గానీ అథారిటీ లో సభ్యులుగా ఉంటారని.. అటువంటి సంప్రదాయం పట్టించుకోకకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని ఆయన అన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేసి.. ఆ బాండ్లను కనీసం రూ.5వేల కోట్ల మేర తిరుమల తిరుపతి దేవస్థానం అథారిటీ ద్వారా కోనుగోలు చేస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.