ఏపీలో తొలి డెల్టాప్లస్ వేరియంట్ కేసు నమోదు..!

By telugu news teamFirst Published Jun 26, 2021, 7:37 AM IST
Highlights

కొన్ని రోజుల ముందే తిరుప‌తిలో ఓ వ్యక్తికి డెల్టా ప్ల‌స్ వైర‌స్ ర‌కం సోకింద‌ని, అయితే త‌ను ఇప్ప‌టికే కోలుకున్నాడ‌న్నారు. ఆయ‌న నుండి ఎవ‌రికీ వైర‌స్ సోకలేద‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

ఆంధ్రప్రదేశ్ లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. గత ఏప్రిల్ నెలలో  ఓ వ్యక్తికి కరోనా సోకగా... అతని నుంచి సేకరించిన డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ తాజాగా గుర్తించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కోవిడ్ కేసుల నమోదు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష జరిపారు.

అనంతరం ఆళ్ల నాని విలేకర్లతో మాట్లాడుతూ.. బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకులదేన్నారు. కొన్ని రోజుల ముందే తిరుప‌తిలో ఓ వ్యక్తికి డెల్టా ప్ల‌స్ వైర‌స్ ర‌కం సోకింద‌ని, అయితే త‌ను ఇప్ప‌టికే కోలుకున్నాడ‌న్నారు. ఆయ‌న నుండి ఎవ‌రికీ వైర‌స్ సోకలేద‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

డెల్టా ప్ల‌స్ కేసుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌న్న మంత్రి ఆళ్ల‌నాని… థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌మీక్ష‌లో సీఎం సూచించార‌ని, బ్లాక్ ఫంగ‌స్ కేసులకు కూడా చికిత్స‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకొకసారి 15 నమూనాలను సీసీఎంబీకి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ వేరియంట్ గుర్తిస్తున్నారు. ఈ నమూనాలను అక్కడే ఉంచి... కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వాటాిని మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ నమూనాను తొలుత పరీక్షించినప్పుడు అనుమానం రాలేదు.

తాజాగా కలకలం రేపుతున్న డెల్టా ప్లస్ గురించి తెలుసుకొనేందుకు మళ్లీ పాత నమూనాలను పరీక్షిస్తుండగా... ఈ నమూనాలో ఆ వేరియంట్ బయటపడినట్లు తెలుస్తోంది.  నమూనా సేకరించిన రెండున్నర నెలలు దాటిన తర్వాత తెలిసిన ఈ కేసుకు సంబంధించిన ఎవరికీ అనారోగ్య లక్షణాలు లేవని అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

click me!