చంద్రబాబును తిట్టొద్దంటే... మద్యం సీసాలతో తల పగలగొట్టి, నిప్పంటించి.. ఇంత ఘోరమా..: లోకేష్ సీరియస్ (Video)

Arun Kumar P   | Asianet News
Published : Dec 21, 2021, 04:05 PM ISTUpdated : Dec 21, 2021, 04:33 PM IST
చంద్రబాబును తిట్టొద్దంటే... మద్యం సీసాలతో తల పగలగొట్టి, నిప్పంటించి.. ఇంత ఘోరమా..: లోకేష్ సీరియస్ (Video)

సారాంశం

గుంటూరు జిల్లా పెదనందిపాడులో దళిత వ్యక్తిపై అతి దారుణంగా జరిగిన దాడిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. 

అమరావతి: గుంటూరు జిల్లా (guntur district) పెదనందిపాడులో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు వెంకటనారాయణ అనే దళితుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. మద్యం సీసాలతో తల పగలగొట్టడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజకీయ పార్టీల విషయంలో గొడవ జరిగినట్లు బాధితుడు తెలిపాడు. 

ఈ దారుణంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu)ను దూషించవద్దని చెబితే ఇంత దారుణంగా కొడతారా? ఇది వైసిపి మూకల పనేనని లోకేష్ ఆరోపించారు.

Video

''గుంటూరు జిల్లా పెద‌నందిపాడు జ‌గ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక‌ల్లో చంద్ర‌బాబు గారిని దూషిస్తోన్న‌ వైసీపీ శ్రేణులను ప్ర‌శ్నించ‌డ‌మే ద‌ళితుడైన వెంకటనారాయణ చేసిన నేరంగా మద్యం సీసాలతో  కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్ష‌స‌మూక‌ల చ‌ర్య‌ల‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. 

Video  వైసిపి నాయకుడిపైనే మంత్రి అనుచరుల దాడి... ఎలా చితకబాదుతున్నారో చూడండి... 

''త‌ప్పుని త‌ప్ప‌ని చెబితే చంపేస్తారా? మంచి చెప్పే మ‌నుషుల ప్రాణాలే తీసేస్తారా? నిన్న ఒంగోలులో వైశ్యుడైన సొంత‌పార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంక‌ట‌నారాయ‌ణ‌... రోజుకొక‌రు వైసీపీ పిశాచ‌ముఠాలకి బ‌ల‌వ్వాల్సిందేనా? ప్ర‌భుత్వ‌మే ఇవ‌న్నీ చేయిస్తోంద‌నేది సుస్ప‌ష్టం. అడ్డుకోవాల్సిన పోలీసులేమ‌య్యారు?'' అని లోకేష్ నిలదీసారు.

తనపై ఎలా దాడి జరిగిందో బాధితుడు వెంకటనారాయణ వివరించాడు. తన అత్తగారి గ్రామమైన పెదకూరపాడు నుండి స్వగ్రామం కొప్పర్రు వెళుతూ మార్గమధ్యలో ఓ వైన్స్ మధ్య మద్యం తాగేందుకు ఆగినట్లు తెలిపాడు. మద్యం తీసుకుని వైన్స్ దగ్గర్లోనే తాగుతుండగా కొందరితో గొడవ జరిగినట్లు తెలిపాడు. మాటా మాటా పెరగడంతో వాళ్లు తనపై మద్యం బాటిల్స్ తో దాడి చేయడంతో పాటు పొదల్లో పడేసి నిప్పంటించి పడేసినట్లు బాధితుడు వివరించాడు. 

ఇదిలావుంటే సొంత వైసిపి పార్టీకి చెందిన నాయకుడిపైనే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తీరువల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటూ ఇటీవల బాలినేని పుట్టినరోజున జరిగిన ఓ కార్యక్రమంలో వైసిపి నేత సుబ్బారావు గుప్త సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

read more  నేనేప్పుడూ మంత్రికి విధేయుడినే: బాలినేని ఇంట్లో సుబ్బారావు ప్రత్యక్షం

ఈ నేపథ్యంలోనే అతడి ఇంటిపై శనివారం కొందరు దాడికి పాల్పడగా ప్రాణభయంతో సుబ్బారావు ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. ఆదివారం అతడి ఆఛూకీ కనుక్కున్న మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ గ్యాంగ్ తో వెళ్లి దాడికి పాల్పడ్డాడు.  సుబ్బారావును సుభానీ బూతులు తిడుతూ దాడిచేయడమే కాదు దీన్నంతా వీడియో తీయించుకున్నాడు. ఈ వీడియో బయటకు లీక్ అయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటనపై కూడా లోకేష్ స్పందించారు. తప్పును తప్పు అని చెబితే సొంత పార్టీ నాయకుడిపైనే దారుణంగా దాడికి పాల్పడతారా? అని మండిపడ్డారు. సుబ్బారావుపై జరిగిన దాడిని కూడా లోకేష్ ఖండించారు. 


 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?