AP: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పోకిరీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. విద్యార్థినీలపై దాడికి పాల్పడుతున్న ఘటనలు సైతం అధికమవుతున్నాయి. ఇదే తరహాలో తోటి విద్యార్థినిని ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని అడిగినందుకు ఓ బీఫార్మసీ విద్యార్థిని కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసకుంది.
AP: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పోకిరీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. విద్యార్థినీలను ఏడిపించడం, వారిని బెదిరించడం, దాడులు చేయడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ఇలాంటి ఘటనే మరొక చోటుచేసుకుంది. విద్యార్ధినులను ఎందుకు ఏడిపిస్తున్నావని అడిగినందుకు ఓ విద్యార్ధిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనతో సదరు కాలేజీలో భాయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థినీలు కాలేజీకి రావాలంటే భయపడిపోతున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఉన్న గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థినిపై దాడికి పాల్పడిన యువకుడు ముత్తాయవలసకి చెందినవాడుగా గుర్తించారు. వివరాల్లోకెళ్తే.. గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీలోని బీ.ఫార్మసీ (B Pharmcy) విభాగానికి చెందిన విద్యార్ధులు క్లాసులు అయిపోయాక బయటకు వచ్చారు. ఇద్దరు విద్యార్ధినులు కాలేజీ అయిపోయాక , ఇంటికి వెళ్లేందుకు కాలేజీ పక్కనే ఉన్న బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే కాలేజీ పక్కనే ఉన్న ముత్తాయవలస గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి .. అదే రోడ్డుపై వెళ్తూ విద్యార్ధినులను ఏడిపించడం మొదలుపెట్టాడు. అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ.. టీజ్ చేయడం మొదలుపెట్టాడు. చాలా రోజుల నుంచి ఆ యువకుడు ఇలా విద్యార్థులను అసభ్యంగా టీజ్ చేస్తున్న ఉన్నాడు.
Also Read: Omicron: భారత్ లో ఒమిక్రాన్ డబుల్ సెంచరీ !
undefined
చాలా రోజుల నుంచి ఆ పోకిరీ ఆగడాలను భరించిన విద్యార్థినీలు.. అతని చేష్టలు శృతిమించడంతో ఆ పోకిరీ గురించి కాలేజీ ప్రిన్సిపల్ కు, ఉపాధ్యాయులకు ఫిర్యాదుచేసారు. అలాగే, తమ తోటి విద్యార్థులకు సైతం ఈ విషయం గురించి చెప్పాడరు. ఈ క్రమంలోనే సోమవారం నాడు సాయంత్రం అక్కడికి చేరుకున్న విద్యార్ధులు, ఉపాధ్యాయులు.. రాజేష్ ను, అతని స్నేహితుడిని అమ్మాయిలను ఎందుకు ఎడిపిస్తున్నారు అని నిలదీసారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పొకిరీ రాజేష్ ను మందలించే పనిచేశారు. అయితే, ఆ యువకుడు ఉపాధ్యాయులు, విద్యార్ధులతో గొడవకు దిగడం ప్రారంభించాడు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. వారిని బెదిరించాడు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఉపాధ్యాయులు, విద్యార్థినీలపై దాడి చేశాడు. ఓ విద్యార్థినిని తీవ్రంగా గాయపరిచి.. అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మొదట బొబ్బిలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని, కత్తిపోట్లు లోతుగా ఉన్నందున మెరుగైన వైద్యం కొరకు విజయనగరం రిఫర్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు.
Also Read: Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేపథ్యంలో WHO వ్యాఖ్యలు
ఈ ఘటనపై విద్యార్థులు మాట్లాడుతూ.. ముత్తాయవలసకి చెందిన రాజేష్.. గత కొంత కాలంగా ఇక్కడి విద్యార్థినీలను అసభ్యకరంగా టీజ్ చేస్తూ..ఏడిపిస్తున్నాడని విద్యార్థినీలు చెప్పారు. అతను విద్యార్థినీలను టీజ్ చేయడం ఇదే మొదటి సారి కాదనీ, చాలా సార్లు అతన్ని హెచ్చరించినప్పటికీ వినిపించుకోవడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలాంటి పోకిరీల కారణంగా కాలేజీకి రావాలంటేనే భయంగా ఉందని పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు నిందితుడు రాజేష్ తీవ్ర అసభ్య పదజాలంతో టీజ్ చేయడమే కాకుండా.. బెదిరింపులకు సైతం గురిచేశాడని తెలిపారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు.
Also Read: హైదరాబాద్‌లో దారుణం..సెల్‌ఫోన్ కోసం స్నేహితుడి హత్య