విజయసాయి అల్లుడికి వరకట్నంగా పోర్టు...ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్..: లోకేష్ ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Feb 05, 2021, 03:06 PM ISTUpdated : Feb 05, 2021, 03:09 PM IST
విజయసాయి అల్లుడికి వరకట్నంగా పోర్టు...ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్..: లోకేష్ ఆందోళన

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతం?'' అని నారా లోకేష్ ప్రశ్నించారు.   

అమరావతి: ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నాడని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి నుండి 28 మంది  ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? అని లోకేష్ నిలదీశారు. 

''32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. వేలాది మంది ప్ర‌త్య‌క్షంగా, ల‌క్ష‌లాదిమంది ప‌రోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే మ‌ణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి మౌనం దాల్చ‌డం దేనికి సంకేతం?'' అని ప్రశ్నించారు. 

''ఇలా ఒక్కో ప‌రిశ్ర‌మా అమ్మేయ‌డం, అడ‌వులు-కొండ‌ల్ని క‌బ్జా చేయ‌డ‌మేనా ప‌రిపాల‌నా రాజ‌ధాని అంటే జ‌గ‌న్‌రెడ్డి గారూ! కాకినాడ పోర్టు విజ‌యసాయిరెడ్డి అల్లుడికి వ‌ర‌క‌ట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలో లేట‌రైట్ గ‌నులు బాబాయ్ సుబ్బారెడ్డికి బ‌హూక‌రించారు. త‌న దోపిడీ మ‌త్తుకి మంచింగ్‌గా మ‌చిలీప‌ట్నం పోర్టుని నంజుకు తింటున్నారు.ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీక‌ర‌ణ ప‌రిపూర్ణం చేసుకోబోతున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం'' అని లోకేష్ స్పష్టం చేశారు. 

read more  జాగ్రత్త... రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమం..: కేంద్రానికి గంటా హెచ్చరిక

ఇదిలావుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక వైసిపి కుట్రలు దాగివున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.  లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేవలం వేయి కోట్లతో కొట్టెయ్యాలని వైసిసి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అయ్యన్న ఆరోపించారు.

''తన బినామీ కంపెనీ చేత, ఈ స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారు. 20 వేల ఎకరాలు, ఎకరా 5 కోట్లు, లక్ష కోట్ల ఆస్తి కేవలం వెయ్యి కోట్లకు కొట్టేస్తున్నారు. ఇందులో ఏ కుట్ర లేకపోతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని చాటి చెప్పాలి'' అని అయ్యన్న సూచించారు.

 ''ఉత్తరాంధ్ర విధ్వంసానికి కుట్రలు పన్నుతున్న ఏ1, కొత్త ఏ2, పాత ఏ2, ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కన్ను వేసారు. 20 వేల ఎకరాల విశాఖ స్టీల్ కొట్టేయటానికి ఈ దొంగల ముఠా స్కెచ్ వేసింది. అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కొట్టేసే కుట్ర పన్నారు.ఆర్టీసిని ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళు, వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్ కొనలేరా?'' అని ట్విట్టర్ వేదికన అయ్యన్న ప్రశ్నించారు. 

''ఇంత పిరికి వాళ్ళు ఏంటి ఎంపీ విజయసాయి రెడ్డి? ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి? ఎవరి కాళ్ళు పిసకటానికి పోయావు? ఎవరి మీద కుట్రలు ప్లాన్ చేసావ్?'' అంటూ విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు అయ్యన్న.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే