కేంద్రంలో అధికారంలో వుంది మేమే.. గుర్తుంచుకోండి: మంత్రులకు వీర్రాజు వార్నింగ్

By Siva KodatiFirst Published Feb 5, 2021, 2:28 PM IST
Highlights

ఏపీ మంత్రులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో వున్నది మేమేనని జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. బీజేపీని విమర్శించే ముందు మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు

ఏపీ మంత్రులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో వున్నది మేమేనని జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. బీజేపీని విమర్శించే ముందు మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

కేంద్రంలో అధికారంలో వున్నది మేమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. మీ నాయకుడు ఢిల్లీ వెళ్లి మా నాయకులను కలుస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు సోము వీర్రాజు.

తాము ఏం చెప్పినా గౌరవంగా, హుందాగా చెబుతున్నామని.. ఎవరినీ తేలిగ్గా మాట్లాడటం లేదని ఆయన గుర్తుచేశారు. తమ పార్టీకి అలాంటి అలవాటు, అవసరం లేదని సోము వీర్రాజు వెల్లడించారు. 

Also Read:పవన్ కల్యాణ్ సెగ: బీసీ సిఎం ప్రకటనపై సోము వీర్రాజు యూటర్న్

కాగా, వైసీపీ, టీడీపీలకు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ సంచలనంగా మరింది. అయితే అయన విసిరిన బీసీ ముఖ్యమంత్రి సవాల్‌పై ఒకరోజు గడవకముందే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యూటర్న్‌ తీసుకున్నారు.

వైసీపీ, టీడీపీకి సవాల్‌ విసిరిన 24 గంటల్లోనే ఆయన వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థిని తాను ప్రకటించబోనని, అది కేంద్ర పార్టీ నిర్ణయమని చెప్పారు. బీసీల అంశాన్ని సోము వీర్రాజు ప్రస్తావిస్తూ జగన్‌కు, చంద్రబాబుకు సవాల్‌ చేశారు.

బీసీని సీఎంను చేస్తారా… ఆ దమ్ము బీజేపీకే ఉందని ప్రకటించారు. ఏపీలో వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చెయ్యగలరా అని సవాల్‌ విసిరారు. 

click me!