విశాఖ రైల్వే జోన్: కేంద్రం కీలక ప్రకటన..!!

By Siva KodatiFirst Published Feb 5, 2021, 2:43 PM IST
Highlights

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు పీయూష్‌ గోయల్‌ సమాధానమిచ్చారు. డీపీఆర్‌పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

జోన్‌ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఓఎస్డీ స్థాయి అధికారి నివేదికపై చర్చించి నిర్ణయం తీసుంటామని.. అలాగే రైల్వే జోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని పీయూష్ గోయల్ తెలిపారు.  

కాగా రైల్వే బడ్జెట్‌లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపింది. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని జాతీయ ప్రాధాన్యమున్న, అనుసంధాన అవసరాలున్న ప్రాజెక్టులకు కేటాయింపులు చేశారు.

ప్రధానంగా నడికుడి - శ్రీకాళహస్తి లైను నిర్మాణానికి 1,144 కోట్ల రూపాయలు, విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను నిర్మాణానికి 800 కోట్ల రూపాయలు, కాజీపేట-విజయవాడ మూడో లైను విద్యుదీకరణకు 300 కోట్లు కేటాయించారు.

జోన్లవారీ బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి రైల్వే శాఖ బుధవారం రాత్రి పింక్‌ బుక్‌ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 5,812 కోట్లు కేటాయించింది.

32 కొత్తలైన్లు, పాతవాటి డబ్లింగ్‌ పనులకు సంబంధించి ఈ నిధులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2009-14 మధ్య రాష్ట్రానికి 886 కోట్లు కేటాయించగా రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే 556శాతం అధిక నిధులు ఇచ్చినట్లు చెప్పింది.

click me!