ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి నారా లోకేష్ విడుదల

Published : Aug 16, 2021, 08:00 PM IST
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి నారా లోకేష్ విడుదల

సారాంశం

ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ నుంచి నారా లోకేశ్‌  సోమవారం నాడు సాయంత్రం విడుదలయ్యారు. బీటెక్ విద్యార్ధిని రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అమరావతి: హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య  కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి సోమవారం నాడు సాయంత్రం విడుదలయ్యారు.

ఇవాళ ఉదయం  రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.లోకేష్ రాజకీయ లబ్దికోసమే రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. లోకేష్ రాకను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. ఈ సమయంలో లోకేష్ తో పాటు ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.లోకేష్ ను అరెస్ట్ చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ సాయంత్రం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి లోకేష్ ను పోలీసులు విడుదల చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?