విగ్రహాల ధ్వంసంతో వైసీపీ పతనాన్ని కొని తెచ్చుకుంటోంది.. నారా లోకేష్...

By SumaBala BukkaFirst Published Jan 3, 2022, 2:11 PM IST
Highlights

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహానీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారమైపోయాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు.

అమరావతి : ప్రభుత్వంపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత Nandamuri Tarakaramaravu విగ్రహాల ధ్వంసానికి వైసీపీ తెగబడటం చాలా దుర్మార్గమని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి 
Nara Lokesh పేర్కొన్నారు. నిన్న దుర్గి, నేడు తాడికొండలో మహానాయకుడు 
NTRవిగ్రహాలని విద్వేషంతో పగటగొట్టారన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహానీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారమైపోయాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు. అధికార మదంతో రహదారిపై ఉన్న విగ్రహాలను కూలగొడుతున్న జగన్ రెడ్డి అండ్ కో... ప్రజలు తమ గుండె గుడిలో కట్టుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎప్పటికీ కూలదోయలేరని నారా లోకేష్ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా దుర్గిలో ఉన్న టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహంపై ప‌ట్ట‌ప‌గ‌లే ధ్వంసం చేయడానికి యత్నించాడు ఓ వైసీపీ నాయ‌కుడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు దాడి చేసిన‌ట్టు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఆదివారం సాయంత్రం జ‌రిగింది. 

NTR Statue: ఎన్టీఆర్ విగ్ర‌హంపై వైకాపా నేత దాడి.. ఎస్పీ ఆదేశాల‌తో నిందితుడి అరెస్టు

మండల కేంద్రమైన దుర్గిలోని బస్టాండ్ స‌మీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేయ‌డానికి వైసీపీ నాయ‌కుడు కోటేశ్వరరావు సుత్తితో ప్రయత్నించాడు. ఈ ఘటనలో దాడిలో విగ్రహం దెబ్బతింది.  సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్... కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడి ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. విగ్రహంపై దాడి చేసిన కోటేశ్వరరావును అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు.  ఘటన‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోటేశ్వరరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.  

కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నం.. రామకుప్పంలో విగ్రహాల వివాదంపై బాబు స్పందన

ఎస్పీ ఆదేశంతో దుర్గి స్టేషన్‌లో కోటేశ్వరరావుపై క్రైం నెంబరు 01/2022గా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు దుర్గి ఎస్‌ఐ పాల్‌ రవీంద్ర తెలిపారు. ఇదిలాఉంటే  గ‌తేడాది మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి యత్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సంయమనం పాటించాలని పార్టీ సీనియ‌ర్ నేతలు సూచిస్తున్నారు.

click me!