
మంగళగిరి : తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కోర్టులో పరువునష్టం దావా వేసిన లోకేష్ ఇవాళ మంగళగిరి మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో లోకేష్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం తీసుకోనుంది.
సినీనటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసారు. కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేసారని పోసాని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన లోకేష్ తనకు కంతేరులో గుంట భూమి కూడా లేదని తెలిపాడు. తనపై నిరాదార ఆరోపణలు చేసినందుకు క్రమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా పోసానికి నోటీసులు పంపించాడు లోకేష్. ఇలా రెండుసార్లు లాయర్ నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో పరువు నష్టం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి కోర్టును ఆశ్రయించారు.
వీడియో
ఇక సింగలూరు ప్రసాద్ అనే మరో వ్యక్తిపైనా లోకేష్ పరువునష్టం దావా వేసారు. ఓ చర్చా కార్యక్రమంలో ప్రసాద్ తనపై నిరాధాన ఆరోపణలు చేసాడని లోకేష్ పేర్కొన్నాడు. టిడిపి అధికారంలో వుండగా ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఓ ఏజన్సీ నుండి లోకేష్ భారీగా డబ్బులు తీసుకున్నట్లు శాంతిప్రసాద్ ఆరోపించాడని... ఇవి నిరాధారమైనవి కాబట్టి వెంటనే క్రమాపణలు చెప్పాలంటూ తన లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. అతడు క్షమాపణలు చెప్పకపోవడంతో లోకేష్ న్యాయస్థానం ద్వారానే తేల్చుకోడానికి సిద్దమయ్యారు.
Read More జగన్ రెడ్డిది పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజం.. మాది హ్యూమనిజం.. : నారా లోకేష్
ఇలా రెండు పరువునష్టం కేసుల్లో వాంగ్మూలం ఇవ్వడానికి లోకేష్ మంగళగిరి కోర్టులో హాజరయ్యారు. దీంతో ఇవాళ యువగళం పాదయాత్ర ఆగిపోయింది. రేపు తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్న లోకేష్ కాలినడకన విజయవాడకు చేరుకోనున్నారు. యువగళం పాదయాత్ర కోసం విజయవాడ టిడిపి నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.