గ్లోబల్ టూరిజంలో ఏపీకి గుర్తింపు రావాలి: విజయవాడలో హయత్‌ప్లేస్ హోటల్‌ ప్రారంభించిన జగన్

By narsimha lode  |  First Published Aug 18, 2023, 11:48 AM IST

పర్యాటక రంగంలో  పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు  ఏపీ సర్కార్  ఆహ్వానాలు పలుకుతుంది.  టూరిజంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా  సీఎం  జగన్ చెప్పారు.


విజయవాడ: గ్లోబల్ టూరిజం లో  ఏపీకి  మంచి గుర్తింపు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయవాడలోని గుణదలలో  టూరిజం పాలసీలో నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి హోటల్  హయత్ ప్లేస్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగించారు.  ఏపీ రాష్ట్రంలోకి పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా  టూరిజం పాలసీని తీసుకు వచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు  ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టుగా సీఎం జగన్  చెప్పారు.

టూరిజం పాలసీలో భాగంగా  ఈ హోటల్ కు అనుమతిని ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక రంగంలో  అగ్రస్థానంలో నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా  సీఎం జగన్ చెప్పారు. ఈ మేరకు పలు ప్రముఖ  సంస్థలను  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్టుగా  సీఎం జగన్ గుర్తు చేశారు. విజయవాడలోనే కాకుండా  రాష్ట్రమంతా హోటల్ నెట్ వర్క్ ను  విస్తరించాలని  సీఎం  జగన్  కోరారు. 

Latest Videos

click me!