తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు న్యూఢిల్లీకి వెళ్లారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన తర్వాత తొలిసారిగా ఆయన న్యూఢిల్లీకి వచ్చారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం నాడు న్యూఢిల్లీకి వెళ్లారు. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొనేందుకు చంద్రబాబు న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, కె. రామ్మోహన్ నాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు.
undefined
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు సహా చంద్రబాబుపై నమోదైన ఇతర కేసులను సుప్రీంకోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.ఆంద్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆరోగ్య కారణాలతో ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే ఈ నెల 21న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది.
also read:Nara Chandrababu naidu...లిక్కర్ కేసు: బాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్
ఈ నెల 29వ తేదీ నుండి రాజకీయ ర్యాలీలు, సభల్లో కూడ కూడ పాల్గొనేందుకు చంద్రబాబుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. మధ్యంతర బెయిల్ సందర్భంగా విధించిన షరతులు ఈ నెల 28వ తేదీ వరకు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.
మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత హైద్రాబాద్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. హైద్రాబాద్ లోని ఎఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎల్ వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అరెస్టైన తర్వాత తొలిసారిగా హైద్రాబాద్ వదిలి ఢిల్లీకి వచ్చారు. రేపు సాయంత్రం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు తిరిగి వెళ్తారు.
హైద్రాబాద్ కు వెళ్లిన తర్వాత చంద్రబాబునాయుడు తిరుపతికి కూడ వెళ్లే అవకాశం ఉంది. తిరుపతి నుండి ఆయన విజయవాడకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.