
MLC Jayamangala Venkata Ramana : వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుజాత అనే మహిళను కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అతి కొద్ది మంది సన్నిహతుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో సునీత అనే మహిళను కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు.
అయితే కుటుంబ వివాదాలు తలెత్తడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా.. మొదటి భార్య ద్వారా వెంకటరమణకు ఒక కూతురు, రెండో భార్య ద్వారా ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. తాజాగా సోమవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వివాహమాడారు. అయితే ఈ వివాహ తంతును రెండో భార్య సునీత దగ్గరుండి జరిపించడం గమనార్హం. ఆమె ఈ వివాహానికి సాక్షి సంతకం కూడా చేశారు. ఆయన కుమారుడు కూడా ఈ పెళ్లి హాజరయ్యారు.