Nandamuri Balakrishna: చేతులు ముడుచుకుని కూర్చోం.. బద్దలు కొట్టుకుని వస్తాం.. బాలకృష్ణ వార్నింగ్

By team teluguFirst Published Nov 20, 2021, 12:51 PM IST
Highlights

సభ సజావుగా జరగకుండా వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చి దృష్టి మళ్లిస్తున్నారని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విమర్శించారు. తన చెల్లెలు భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వ్యక్తిగత దాడి దురదృష్టకరమని అన్నారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. 
 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly sessions) తన సతీమణిని దూషించారంటూ తెలుగు దేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో బోరున విలపించడం.. రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నందమూరి కుటుంబం ఘాట్‌గానే స్పందించింది. ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి సుహాసిని స్పందించగా.. తాజాగా నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం అని బాలకృష్ణ అన్నారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు ఎప్పుడూ కన్నీరు పెట్టుకోలేదని తెలిపారు. 

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని అన్నారు. సభ సజావుగా జరగకుండా వ్యక్తిగత అంశాలు తీసుకొచ్చి దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. తన చెల్లెలు భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వ్యక్తిగత దాడి దురదృష్టకరమని అన్నారు. వ్యక్తిగత దూషణలు సరికావని హితవు పలికారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఎంతో మేధావులు ఉన్నారు.. కానీ ఇంత నీచానికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. తాను ఒక శాసనసభ్యుడినని తన మీదకు రావచ్చొని.. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీదకు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి తల్లులు, భార్యలు, పిల్లలు ఉన్నారని, పర్సనల్‌గా టార్గెట్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించారు. 

తన చెల్లి హెరిటేజ్ నడుపుతుందని.. సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వాళ్లలో ఎవరైనా ఇలా చేసారా అని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ము అంతా ఇంట్లోకి చేర్చడమే వాళ్ల పని అని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో ఆడవాళ్లు కూడా చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

Also read: Purandeswari: భువనేశ్వరి వ్యక్తిత్వంపై దాడి జరిగిన తీరు బాధించింది.. రాజీపడే ప్రసక్తే లేదు.. పురంధశ్వేరి

తాము వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శలు చేయలేదని అన్నారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం సాధారణంగా జరుగుతుందని.. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని అన్నారు. ఏకపక్షంగా శాసనసభను నడుపుతున్నారని.. బాలకృష్ణఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం లేదన్నారు. 

చంద్రబాబు చెప్పడం వల్లే ఇన్నాళ్లూ సహనంగా ఉన్నాయమని.. ఇకపై నోరు తెరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని మండిపడుతున్నారు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని బాలకృష్ణ అన్నారు. వీర్రవీగి మాట్లాడేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు. మెజారిటీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఉరుకునేది లేదని అన్నారు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుందని అన్నారు. మళ్లీ ఇలాంటి నీచమైన పదాలు వాడితే భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. సీఎం కొడుకుగా కానీ... సీఎంకు బావమరిదిగానూ తానేప్పుడూ వ్యవహరించలేదని చెప్పారు. మమ్మల్ని అడ్డుకునే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామని హెచ్చరించారు. కులాలు, మతాల పేరిట సమాజాన్ని చీల్చి ఓట్లు సాధించారని విమర్శించారు. రాష్ట్రంలో  మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో చూస్తునే ఉన్నామని బాలకృష్ణ తెలిపారు. 

click me!