ఈ రోజు కూడా రాయలసీమలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాయలసీమలో రేపటికల్లా ఈ వర్షాలు తెరిపినిస్తాయని అంచనా. తెలంగాణలో మాత్రం రేపుకూడా ఉరుములతో కూడిన జల్లులు చెదురుమదురుగా పడతాయని చెబుతున్నారు.
రాయలసీమ మీద కర్నాటక తమిళనాడులను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు కూడా రాయలసీమలో భారీ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని Department of Meteorology తెలిపింది.
ఈ రోజు కూడా రాయలసీమలో భారీ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. అయితే, రాయలసీమలో రేపటికల్లా ఈ వర్షాలు తెరిపినిస్తాయని అంచనా. తెలంగాణలో మాత్రం రేపుకూడా ఉరుములతో కూడిన జల్లులు చెదురుమదురుగా పడతాయని చెబుతున్నారు.
మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో heavy rains కారణంగా భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. ఎడతెరిపిలేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లాలో chitravati river కూడా ఉగ్ర రూపుదాల్చింది. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతవగా, నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 మంది తిరిగి బయటికి వచ్చే వీల్లేక నదిలోనే ఓ జేసీబీపైనే ఉండిపోయారు.
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతరం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని narendra modi శుక్రవారం నాడు ఫోన్ చేశారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రధాని మోడీ సీఎం జగన్ ను వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం YS Jagan ను ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. సహాయక చర్యలను ప్రధాని అడిగి తెలుసుకొన్నారు.రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు.
AP MLC Elections: తలశిల రఘురామ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభినందనలు..
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.టెంపుల్ సిటీ తిరుపతిలో భారీగా వర్షం కురిసింది. దీంతో తిరుపతి వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. Tirumala ghat roadను టీటీడీ అధికారులు మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు ఎవరూ కూడా రావొద్దని టీటీడీ అధికారులు కోరారు.
గత వారం రోజుల క్రితం కూడ ఏపీ రాష్ట్రంలో బంగాళాఖాతంలో వాయు గుండం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వారం రోజుల తర్వాత మరోసారి భారీ వర్షాలు కురిశాయి. వారం రోజుల క్రితం కంటే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడప జిల్లాలో చేయ్యేరు వరద ఉధృతికి 30 మంది కొట్టుకుపోయారు. ఇప్పటికే 12 మృతదేహాలను వెలికితీశారు.
భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, రైల్వే ట్రాకులుపై భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా south central railway పలు రైళ్లను రద్దు చేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. నందలూరు – రాజంపేట మధ్య పట్టాలపై నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంది.