శక పురుషుని శత జయంతి.. వేడుకల్లో మా కుటుంబం భాగమవుతుంది: తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ

By Sumanth KanukulaFirst Published May 21, 2022, 12:10 PM IST
Highlights

ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపనున్నట్టుగా సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని తెలిపారు. 

ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపనున్నట్టుగా సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని తెలిపారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.  ‘‘శక పురుషుని శత జయంతి’’ పేరుతో వేడుకలు నిర్వహిస్తామని బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు చైర్మన్‌గా బాలకృష్ణ, గౌరవ చైర్మన్‌గా నందమూరి జయకృష్ణ, కన్వీనర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరించనున్నారు. 

‘‘మా నాన్న గారు సినీ రంగంలో అడుగుపెట్టారు.. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలెత్తి చూసింది. టీడీపీని స్థాపించారు.. తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలువుతుంది. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు 365 రోజుల పాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. 

కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు తమ నందమూరి కుటుంబం హాజరవుతుందని.. ఆనందంలో పాలుపంచుకుంటుందని చెప్పారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వామ్యులతారని చెప్పారు. తాను ఈ నెల 28వ తేదీ ఉదయం తమ స్వస్థలం నిమ్మకూరు వెళ్లి.. అక్కడి వేడుకల్లో పాల్గొననున్నట్టుగా తెలిపారు. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకోనున్నట్టుగా చెప్పారు. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని ప్రకటించారు. 

365 రోజులు... వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి.. ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొననున్నట్టుగా బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు. 

click me!