చెప్పేదొకటి...జరుగుతున్నదొకటి

Published : Feb 04, 2017, 04:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
చెప్పేదొకటి...జరుగుతున్నదొకటి

సారాంశం

విశాఖపట్నంలో కూర్చునే లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తుండగా మళ్ళీ పెట్టుబడుల కోసమంటూ కోట్ల రూపాయలు వ్యయంతో ప్రత్యేక విమానాలేసుకుని చంద్రబాబు ఎందుకు విదేశాలకు వెళుతున్నట్లు?

కేంద్రమంత్రి వెంకయ్యనాయడు పాటను పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి వరకూ కేంద్రం ఏపికి ప్రత్యేకంగా రూ. 2.25 లక్షల కోట్ల సాయం చేస్తోందని ప్రకటించేవారు. అయితే, తాజా భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాల్లో రూ. 6.5 లక్షల కోట్లు కేవలం కేంద్ర సంస్ధలదే అంటూ మొదటుపెట్టారు. భాగస్వామ్య సదస్సులో రూ. 10.54 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినట్లు చంద్రబాబునాయుడు చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో కేంద్రం వాటాయే రూ. 6.5 లక్షల కోట్లని ఇపుడు వెంకయ్య శెలవిస్తున్నారు.

 

మొన్నటి వరకూ చెప్పిన రూ. 2.25 లక్షల కోట్లు ఐదేళ్ళలో కేంద్రం చేయబోయే సాయం. అంతేకానీ ఇప్పటికే చేసిన  ఖర్చు కాదు. అయితే, వెంకయ్య మాత్రం పై మొత్తం ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేసిందన్న బిల్డప్ ఇస్తుంటారు. నిజానికి మిగిలిన రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఏపికి కూడా కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. అంతేకానీ రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా కేంద్రం లేదా, వెంకయ్య చేస్తున్నదేమీ లేదు. కేంద్రమేదో ఏపికి ఏదో ఉదారంగా లక్షల కోట్లు ఇచ్చేస్తోందన్నట్లుగా వెంకయ్య బిల్డప్ ఇస్తున్నారంతే.

 

ఇక, తాజాగా చేసుకున్న భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చదన్న సంగతి అందరికీ తెలిసిందే. చేసుకున్న రూ. 10.54 లక్షల కోట్ల ఒప్పందాల్లో 5 శాతం కార్యరూపందాలిస్తే చాలా ఎక్కువే. అదికూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలున్నాయి కాబట్టే. ఎందుకంటే, పోయిన ఏడాది జరిగిన రూ. 4.7 లక్షల కోట్ల ఒప్పందాల్లో కనీసం 1000 కోట్లు కూడా రాలేదు. ఇది స్వయంగా ప్రభుత్వమే అంగీకరించిన వాస్తవం. కాబట్టి ఇపుడు వెంకయ్య చెబుతున్న రూ. 6.5 లక్షల కోట్ల పాట ఉత్తమాటే.

 

అదే సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నపుడు ఇక ప్రత్యేకహోదాతో అవసరమేమిటని సిఎం ప్రశ్నిస్తున్నారు. మరి విశాఖపట్నంలో కూర్చునే లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తుండగా మళ్ళీ పెట్టుబడుల కోసమంటూ కోట్ల రూపాయలు వ్యయంతో ప్రత్యేక విమానాలేసుకుని చంద్రబాబు ఎందుకు విదేశాలకు వెళుతున్నట్లు? చెబుతున్న మాటలకు జరుగుతున్న పనులకూ అసలేమన్నా పొంతనుందా?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?