రోడ్డున పడి రోధించిన టిడిపి ఎంపి కూతురు

Published : Feb 04, 2017, 03:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రోడ్డున పడి రోధించిన  టిడిపి ఎంపి కూతురు

సారాంశం

స్వర్ణాంధ్రలో  దళిత ఎంపిగారి డాక్టర్ కూతురి దీనాలాపన ఇది. మిగతా ఎంపిలంతా బిజినెస్ చేసుకుంటూ ‘పచ్చ’గా బంగారు లాగా నిగనిగలాడుతూ ఉంటే, పార్టీ కోసం, పార్టీలో తన ఉనికి కోసం నానా తపన పడుతున్న  చిత్తూరు లోక్ సభ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ కూతురు  ఆమె.

మంత్రిగారికి దగ్గరి వాడయితే ఎవరూ ఏమీ  చేయలేరు.

 

దానికి తోడు ప్రభుత్వంలోఉన్న ఉన్నతాధికారికి వేలువిడిచిన బంధువయితే,  అతగాడి చేతులు,నాలుక రెండంచుల కత్తులే.

 

 ఈ రెండంచుల ’కత్తి‘తో తిరుపతి లో రాజకీయంగా బలిసిన నరేంద్ర అనే పెద్ద మనిషి ఒక దళిత డాక్టర్ మీద విరుచుకు పడ్డాడు.

 

అధికార పార్టీకే చెందిన ఎంపి కూతురు అనేది ఆమెకు ఇమ్యూనిటీ ఇవ్వలేదు.   తక్కువ కులం కావడం ఆగ్నికి ఇంకా  ఆజ్యమయింది.

 

రోడ్డు మీద ఉన్న కారు డోర్లు మూసేయి అన్నందుకు నరేంద్ర కారు డ్రయివర్ అమాంతం డాక్టర్ మాధవీలత కారు డ్రైవర్ మీద దాడిచేశాడు. ఇదేమిటని అడిగినందుకు ఆయన బాసు డాక్టర్ మీద దాడి చేసి, తిట్టి అవమాన పరిచాడు.డాక్టర్ మాధవీలత ఎవరో కాదు, మిగతా ఎంపిలంతా బిజినెస్ చేసుకుంటూ ‘పచ్చ’గా బంగారు లాగా నిగనిగలాడుతూ ఉంటే, పార్టీ కోసం, పార్టీలో తన ఉనికి కోసం నానా తపన పడుతున్న  చిత్తూరు లోక్ సభ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ కూతురు.

 

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం సర్పంచు ఒక మహిళ మీద దాడిచేసిన సంఘటన వీడియో ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే, ఈ సంఘటన జరిగింది.

 

రెండింటికి చాలా పోలికలున్నాయ. అధికార పార్టి అండతో కొంతమంది ఎలా విర్రవీగుతున్నారో  ఈ సంఘటనలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో నీళ్ల ట్యాంకు గట్టు సర్పంచు ఇంటికి అడ్డమవుతుందని సమీంపలో తన ఇంటి వైపు ఏర్పాటుచేయడాన్ని ప్రశ్నించిన మహిళలను కాల్తో కొట్టి హీనంగా ప్రవర్తించాడు.

 

ఇపుడు కారు డోర్లు మూయమన్నందుకు   ఒక మంత్రికి సన్నిహితుడుయిన పెద్ద మనిషని ఒక దళిత మహిళ మీద దాడి చేసి  రోడ్డున పడేశాడు.ఇది తిరుపతిలో మాధవీ లతతెలియని వారుండదరు. ఎంపి శివప్రసాద్ చాలా  ప్రజాదరణ ఉన్న ఎంపి.  ఆయన హోదా ఎలాంటి రక్షణ ఇవలేదు. దళితులయినందునే ఈ అవమానం జరిగిందనేందుకు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు.

 

పోలీసుల కథనం ప్రకారం జరిగిందిది.

 

శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్‌ మాధవీలత రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలోరోడ్డు లో కారులో వెళ్తున్నారు. ఒక చోట రోడ్డు మధ్యలో డోర్లు తెరిచి నిలబెట్టిన కారును పక్కకు తీయాల్సిందిగా మాధవీలత డ్రైవర్‌ ఆంజనేయులు హారన్‌ కొట్టారు. అంతే...పక్కనే ఉన్న ఇంట్లోంచి బయటకు వచ్చిన నరేంద్ర అనే వ్యక్తి హారన్‌ కొడితే నరుకుతానన్నట్లు సైగ చేశాడు. మాధవీలత డ్రైవర్‌ ఆంజనేయులు కారు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగాడు. వీరు వాదులాడుకుంటుండగానే పక్కనే ఉన్న నరేంద్ర డ్రైవర్‌ దీపు ఆంజనేయులుపై దాడి చేశాడు.



కారులోంచి గమనించిన డాక్టర్‌ మాధవీలత వెంటనే కిందకు దిగి ఇదేమిటని వారిని నిలదీసింది. నరేంద్ర, మాధవీలతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.  డాక్టర్ మీదకు బూతులు ప్రయోగించాడు. తనకు న్యాయం చేయాలని డాక్టర్‌ మాధవీలత అక్కడే రోడ్డుపై బైఠాయించింది. ‘ఆయన మా డ్రైవర్ని దారుణంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో ధూషించాడు. మహిళనని చూడకుండా నాపై దౌర్జన్యం చేస్తూ రోడ్డు మీద తోసేసి వెళ్లాడు. మధ్యాహ్నం  నుంచి ఇక్కడే కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంటే పట్టించుకున్న వారే లేరు. మహిళలకు  రక్షణ ఇదేనా?’ అని ఆమె  కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపి కుమార్తె, డ్రైవర్‌పై దాడిచేసి, దూషించిన వ్యక్తి ఒంగోలు ఎక్సైజ్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి మేనల్లుడని, అంతేకాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఆ నిందితుడికి అండగా ఉన్నట్లు సమాచారం.

 

తిరుపతిలో పోలీసు ఉన్నతాధికారి ఒక  మహిళ అయిన తనకు న్యాయం జరగులేదని డాక్టర్ ఆవేదన చెందారు.

 

రెండు కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్టుచేశారు. తర్వాత కథ మంత్రుల ఆఫీసుకు, బాధితులు నోరు మూసుకుని ఇళ్లకు వెళ్లిపోతారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu