మంత్రిగా లోకేశ్ తొలి సంతకం చేశారు...

Published : Apr 07, 2017, 07:40 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
మంత్రిగా లోకేశ్ తొలి సంతకం చేశారు...

సారాంశం

గ్రామాలలో ఎల్ ఇ డి వీధి దీపాలు ఏర్పాటుచేసే కార్యక్రమం ఆంధ్రతోనే మొదలవుతూ ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.

 

 

 

పంచాయతీ  రాజ్ శాఖ మంత్రి గా నారా  లోకేశ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఒక కీలకమయిన సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన  దస్త్రం మీద తొలి సంతకం చేశారు. తర్వాత మరొక రెండు ఫైళ్ల మీద కూడా ఆయన సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.

 

అవి :  1. ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే దస్త్రంపై  తొలి సంతకం. దీని ద్వారా రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

2. అనంతరం పంచాయతీరాజ్‌ ద్వారా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ దస్త్రంపైనా ,

 3. ఆపైన గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన  దస్త్రంపై ఆయన సంతకం చేశారు.

 

ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్ర  ప్రదేశే.  ఇపుడు  ఈ కార్యక్రమం నారా లోకేశ్ పర్యవేక్షణలో జరుగుతుంది.

 

ఈ సందర్భంగా లోకేశ్ గారుమాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

రెండేళ్లలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu