నంద్యాల టిడిపి టికెట్ కోసం మొదలయిన ముఠా పోరు

First Published Apr 7, 2017, 5:31 AM IST
Highlights

ఇటీవల మరణించిన  నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి కూతురు ఇప్పటికే ఎమ్మెల్యే. మంత్రి పదవి కూడా ఇచ్చారు. కాబట్టి కుటుంబంలో మరొకరికి ఇచ్చే అవకాశం లేదనే వాదన వినపడుతూ ఉంది. అందువల్ల  ఈ సీటు ఓపెన్ కాంపిటీషన్ లో పెట్టే అవకాశం ఉందనే ఆశతో  దీనిని ను దక్కించుకునేందుకు తెలుగుదేశంలో ఉన్న ముఠాలన్నీ నంద్యాల చుట్టు ముసురుకుంటున్నాయి. ముఠాల  నాయకులు సమావేశాలు పెడుతున్నారు. అధిష్టానానికి విజ్ఞప్తులు పంపిస్తున్నారు.తమ బలమెంతో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక తప్పక పోవడంతొ  ముఠా రాజకీయ వేడిరాజుకుంటూ ఉంది.

 

సాధారణ పదవిలో ఉన్న ఎమ్మెల్యేచనిపోతే, కుటుంబ సభ్యులొకరని ఏకగ్రీవంగా గెలిపించే ప్రయత్నం జరుగుతుంది. లేదా ఎన్నిక ఉన్నా చనిపోయిన వ్యక్తి వారసులే గెలుస్తుంటారు. నంద్యాల ఎన్నిక ఈ సారి దీనికి భిన్నంగా ఉంటుంది. చనిపోయిన భూమానాగిరెడ్డి కూతురు ఇప్పటికే ఎమ్మెల్యే. మంత్రి పదవి కూడా ఇచ్చారు. కాబట్టి కుటుంబంలో మరొకరికి ఇచ్చే అవకాశం లేదనే వాదన వినపడుతూ ఉంది. అందువల్ల  ఈ సీటు ఇపుడు ఓపెన్ కాంపిటీషన్ లో పెట్టే అవకాశం ఉంది. ఈ ఆశతో ఈ సీటును ను దక్కించుకునేందుకు తెలుగుదేశంలో ఉన్న ముఠాలన్నీ నంద్యాల చుట్టు ముసురుకుంటున్నాయి. ఈ ముఠాల  నాయకులు సమావేశాలు పెడుతున్నారు. అధిష్టానానికి విజ్ఞప్తులు పంపిస్తున్నారు.తమ బలమెంతో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

పోటీలో మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి వర్గం, మాజీ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ వర్గం, ఫిరాయింపు ఎంపి ఎస్ పివై  రెడ్డి వర్గం ఉన్నాయి. వీళ్లకి తోడు ఈనియోజకవర్గం భూమాకుటుంబానిది కాబట్టి కుటుంబంలోని వ్యక్తికే ఇవ్వాలని భూమా బ్రహ్మానందరెడ్డి  అడుగుతున్నారు.

 

ఇది మా నియోజకవర్గం, గతంలో నేను పార్టీ పోటీ చేసి ఓడిపోయాను, ఇపుడు మళ్లీ పోటీచేసేందుకు అవకాశం వచ్చింది కాబట్టి  నాకే టికెట్ ఇవ్వాలన్నది శిల్పామోహన్ రెడ్డి వాదన.

 

ఆయన ఇప్పటికే ఈ విషయం  పెద్దాయన చెవిలో వేశాడని, తనకు ఇవ్వకపోతే మాత్రం బాగుండదని కూడా హెచ్చరిక చేశారని చెబుతున్నారు. ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి మనోగతాన్ని  నాయకుడికి తెలియచేస్తాడట. టికెట్ ఇవ్వకపోతే, స్వతంత్రంగానే పోటీ చేస్తాననిఅనుచరులతో ఆయన అన్నట్లు, వారంతా సై అన్నట్లు చెబుతున్నారు. భూమాకుటుంబానికి ఇంకా ఎన్ని సీట్లిస్తారనేది ఆయన ప్రశ్న.

 

ఇక, ఇది ముస్లింల సీటని, తాను చాలా సార్లు ప్రాతినిధ్యం వహించానని చెబుతూ తనకే ఇవ్వాలని ఫరూక్ పట్టుబడుతున్నారు.

 

అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్‌ఫర్మ్‌ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు.

 

అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు అశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి  భూమానాగిరెడ్డి అన్న అయిన శేఖర్ రెడ్డికుమారుడు. కుటుంబం ఆయన పేరు  ప్రతిపాదించిందని తన తండ్రి సేవలకు గుర్తింపుగా తనకు టికెట్ ఇవ్వాలని బ్రహ్నానందరెడ్డి అంటున్నారు. ఇక భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే, తన అల్లుడు శ్రీధర్ రెడ్డి కిగెలిపించే పూచీ తనదేని ఎస్ పి వై రెడ్డి అంటున్నారు. ఇదీ సంగతి.

click me!