ప్రభుత్వంపై అంత అసంతృప్తి ఉందా ?

Published : Nov 02, 2017, 07:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రభుత్వంపై అంత అసంతృప్తి ఉందా ?

సారాంశం

చంద్రబాబునాయుడు ఆమధ్య అమెరికా పర్యటన తర్వాత రాష్ట్రంలోని ప్రజల సంతృప్తే ప్రధమం అంటూ ఓ కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేసారు.

చంద్రబాబునాయుడు ఆమధ్య అమెరికా పర్యటన తర్వాత రాష్ట్రంలోని ప్రజల సంతృప్తే ప్రధమం అంటూ ఓ కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేసారు. దానిపేరే ‘పీపుల్ ఫస్ట్’.  జనాల్లోని సంతృప్తస్ధాయిలను గుర్తించేందుకు ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ అనే వ్యవస్ధను ఏర్పాటు చేసి ఫిర్యాదులు చేయటానికి టోల్ నెంబర్ 1100 అనే ఫోన్ కూడా ఏర్పటు చేసారు. ఇపుడు ఆ 1100 ఫోన్ కే రోజుకు 15 లక్షల ఫోన్ కాల్స్ వస్తున్నాయట. అంటే 15 లక్షల ఫిర్యాదులన్నమాట. రోజుకు అన్నేసి లక్షల ఫిర్యాదులు వస్తున్నాయంటే అర్ధం ఏంటి. ప్రభుత్వ పనితీరుపై జనాల్లో ఏ స్ధాయిలో అసంతృప్తి ఉందో అర్ధమైపోతోంది.  

అందులోనూ ప్రభుత్వ పనితీరుపై మూడు జిల్లాల్లో జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజాసాధికార సంస్ధ ‘రియల్ టైమ్ గవరర్నెన్స్’ ఈ విషయాన్ని గుర్తించింది. విదేశాల్లో లాగ ప్రజల సంతృప్తే ముందు అన్న పద్దతిలో చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఈ వ్యవస్ధను ఏర్పాటు చేసారు లేండి. అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనాలకు అందుతున్న విధానం,  వివిధ పథకాల అమలుపై ప్రజల ఫీడ్ బ్యాక్, లబ్దాదారుల సంతృప్త స్ధాయి, ప్రభుత్వ కార్యాయలాల్లో పనులు జరుగుతున్ తీరు తదితరాలపై  ఆ వ్యవస్ధ సర్వే జరిపింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల శాంపిళ్ళు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అనుకున్న విధంగా పనులు కావటం లేదని, పథకాలు సకాలంలో అందటం లేదంటూ కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారట. సరే, వచ్చిన ఫీడ్ బ్యాక్ ను టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా వ్యవస్ధను పర్యవేక్షిస్తున్న వారు సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పంపారనుకోండి అది వేరే సంగతి.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu