మళ్ళీ ట్రాన్ స్ట్రాయ్ కే పోల‘వరం’

First Published Nov 1, 2017, 10:06 PM IST
Highlights
  • పోలవరం పనులను ట్రాన్ స్ట్రాయ్ ద్వారానే పూర్తి చేయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
  • బుధవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయమైంది.

పోలవరం పనులను ట్రాన్ స్ట్రాయ్ ద్వారానే పూర్తి చేయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయమైంది. ఇన్ని రోజులూ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ అనుకున్న మేర ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేకపోతోంది కాబట్టి కాంట్రాక్టర్ ను మార్చుకుంటామంటూ చంద్రబాబు కేంద్రాన్ని అడిగిన సంగతి అందరకీ తెలిసిందే. మరి ఏమైందో ఏమో మళ్ళీ అదే సంస్ధతో పనులు చేయించాలని డిసైడ్ అయ్యింది.

నిపుణులను తెప్పించి పనులను వేగంగా చేస్తామని సంస్ధ యాజమాన్యం హామీ ఇచ్చిందట. ఆ హామీతో మంత్రివర్గం సంతృప్తి చెంది సరే అంటూ తలూపిందట. నిపులను తెప్పించి పనులను వేగంగా పూర్తి చేసే సామర్ధ్యమే ఉంటే ఆ పని ఇప్పటికే ఎందుకు చేయలేదని మంత్రివర్గంలో ఎవరికీ అనుమానం ఎందుకు రాలేదో? పైగా పోలవరం గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి లేదంటూ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎదురుదాడి చేస్తున్నారు. పట్టిసీమ దండగ అని వైసీపీ అన్నది నిజమే. పట్టిసీమ వల్ల రూ. 10 వేల కోట్ల విలువైన పంటలు అదనంగా వచ్చిందని ఉమా చెబుతున్నారు. పట్టిసీమ దండగని వైసీపీనే కాదు నిపుణులు కూడా చాలామంది అదే చెప్పారు.

ప్రతీనెలా జరిగే క్యాబినెట్ సమావేశంలో పోలవరం పై సమీక్ష చేయాలని నేటి సమావేశం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రూ. 12,465 కోట్లు వ్యయం చేసినట్లు దేవినేని తెలిపారు. కేంద్రం నుండి ఇంకా రూ. 3 వేల కోట్లు రావాల్సుందన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ 2019 కల్లా పోలవరం పూర్తి చేస్తామని దేవినేని చెప్పటం గమనార్హం.

 

click me!