చంద్రబాబు ట్వీట్ కు అర్ధమేంటి ?

First Published Dec 13, 2017, 7:24 AM IST
Highlights
  • పై ట్వీట్ చూస్తే చాలా చంద్రబాబునాయుడు ధీనస్ధితి అర్ధమైపోతోంది

పై ట్వీట్ చూస్తే చాలా చంద్రబాబునాయుడు ధీనస్ధితి అర్ధమైపోతోంది. ఎంత బేలగా అయిపోయితే పై ట్వీట్ చేశారో? ఇంతకీ ట్వీట్ వెనుకున్న ‘విషయం’ ఏంటి ? అంటే ఇంకేముంది పోలవరం ప్రాజెక్టే. ‘నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇన్ని ఒడుదుడుకులు ఎదుర్కోలేద’ట. ఇపుడు మాత్రం రాజకీయంగా చంద్రబాబుకు వచ్చిన ఒడిదుడుకులేంటి ? అంటే ప్రధానంగా రెండు అంశాలు కనబడతాయి. మొదటిది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనిశ్చితిలో పడిపోవటమైతే, రెండో అంశం అమరావతి నిర్మాణం ప్రారంభం కాకపోవటం.

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ముంచుకువస్తుండగా చంద్రబాబులో ఎందుకింత బేలతనం ? అంటే పూర్తిగా స్వయంకృతమనే చెప్పాలి. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయమైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేతిలో నుండి బలవంతంగా చంద్రబాబే లాక్కున్నారు. దానికితోడు కేంద్రం అనుమతి లేకుండానే పోలవరం అంచనా నిర్మాణ వ్యయాన్ని తన ఇష్టం వచ్చినట్లు పెంచేసుకున్నారు. పైగా మొత్తం అవినీతి ఆరోపణలే. దాంతో కేంద్రం అడ్డం తిరిగింది. ఫలితమేంటో అందరూ చూస్తున్నదే.

ఇక, రాజధాని నిర్మాణం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి ఏంటి? చేతిలో ఉన్న డబ్బులతో మనం ఏం చేయగలం అన్న వాస్తవ పరిస్ధితులతో నిమ్మితం లేకుండా భ్రమల్లో ముణిగిపోయారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ఒకటే ఊదరకొడుతున్నారు. అది అయ్యేది కాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. కాకపోతే చంద్రబాబే భ్రమల్లో నుండి బయటపడటం లేదు.

చంద్రబాబుకు ప్రతిదీ ఎన్నికల స్టంట్లే. అంటే, పోలవరమైనా, ఇంకా మొదలేకాని రాజధాని నిర్మాణానైనా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటారనటంలో ఎవరికీ సందేహాలు లేవు. వాస్తవ పరిస్ధితులతో సబంధం లేకుండా భ్రమల్లో ఉంటున్నారు కాబట్టే ఏడాదిన్నరలో ఎన్నికలు ముంచుకువస్తుండగా చంద్రబాబులో బేలతనం స్పష్టంగా బయటపడింది. కాకపోతే తన బేలతనాన్ని కూడా ప్రజల నుండి సింపతి రాబట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితికి వైసిపినో లేదా కాంగ్రెస్సో లేకపోతే ఇంకేదో పార్టీనో కారణం కాదు స్వయంగా చంద్రబాబే కారణం.

 

 

click me!