రాయలసీమ రెడ్లకు దేశం ‘అధికారం ఎర’

First Published Oct 6, 2017, 7:12 AM IST
Highlights
  • రాయలసీమలో వైసీపీని దెబ్బ కొట్టటమే లక్ష్యంగా చంద్రబాబానాయుడు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ‘అధికారమనే ఎర’ వేస్తున్నట్లు కనబడుతోంది

రాయలసీమలో వైసీపీని దెబ్బ కొట్టటమే లక్ష్యంగా చంద్రబాబానాయుడు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ‘అధికారమనే ఎర’ వేస్తున్నట్లు కనబడుతోంది. తెలుగుదేశంపార్టీ ఏర్పాటైనప్పటి నుండి మెజారిటీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంది. అయితే, 2014లో జరిగిన రాష్ట్ర విభhttps:///Q7JQ9kజన కారణంగా రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ ను వీడి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడింది. రాష్ట్ర విభజనకు ముందే జగన్ కాంగ్రెస్ ను వీడటం, అప్పటికే వైఎస్సార్ కున్న చరిష్మా జగన్ కు బాగా కలిసి వచ్చింది.

2014 ఎన్నికల్లో జగన్ కు వ్యతరేకంగా చంద్రబాబునాయుడు, నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ లు ఎంత పోరాటం చేసినా వైసీపీకి 67 సీట్లు వచ్చాయంటే రాయలసీమలో గెలుచుకున్న సీట్లే కారణం. రాయలసీమలోని నాలుగు జిల్లాలైన కర్నూలు, చిత్తూరు, కడపలో వైసీపీదే మెజారిటి. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రమే టిడిపి హవా కనబడింది.

సరే, ప్రస్తుతానికి వస్తే రాయలసీమలో మెజారిటీ సీట్లు సాధించనిదే రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రావటం కష్టమని చంద్రబాబుకు అర్ధమైపోయింది. ఎందుకంటే, మూడున్నరేళ్ళ క్రితం అధికారంలోకి రావటానికి అనుకూలించిన పరిస్ధితులు ఇపుడు లేవు. పైగా చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకే కొత్త ప్లాన్లు వేస్తున్నారు. అందులో భాగమే రాయలసీమలో రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకోవటం. పోయిన ఎన్నికల్లో కాపులను దువ్వినట్లే వచ్చే ఎన్నికల్లో రెడ్లను దగ్గరకు తీసుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు.

రాయలసీమలో రెడ్లను కాదని రాజకీయం చేయటం కష్టమన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా రెడ్లు జగన్ కే మద్దతుగా నిలిస్తే టిడిపి అధికారంలోకి రావటం అంత సులభం కాదు. రెడ్డి సామాజికవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న రెడ్లను రమ్మంటే ఎవరు మాత్రం ఊరకే వస్తారు?  అందుకనే అధికారమనే ఎర వేయాలని నిర్ణయించారు.

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పార్టీలో ప్రచారం బాగా జరుగుతోంది. విస్తరణలో రెడ్లకు పెద్ద పీట వేయటం, కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించటం, కాంట్రాక్టులు లేదా ఆర్ధికంగా బలోపేతం చేయటం...ఇలా ఎవరి అవసరాలు, ఎవరి కోరికలకు తగ్గట్లుగా వారిని సంతృప్తి పరచటమన్నమాట. 2018 సెప్టెంబర్లో ముందస్తు ఎన్నికలకు రెడీ అంటూ ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది కదా? కాబట్టి ఎర వేయటమేదో వీలైనంత వేగంగా జరగాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించారట. చూడాలి మరేం జరుగుతుందో?

click me!