సినీమాయలో చంద్రబాబు

Published : Oct 05, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సినీమాయలో చంద్రబాబు

సారాంశం

చంద్రబాబునాయుడు సినీమాయలో పడిపోయారు. ప్రతీ దానికీ సినిమా దర్శకులో లేక సినీ ప్రముఖులో చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా వింటున్నారు.

చంద్రబాబునాయుడు సినీమాయలో పడిపోయారు. ప్రతీ దానికీ సినిమా దర్శకులో లేక సినీ ప్రముఖులో చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా వింటున్నారు. అమరావతి నిర్మాణంలో ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళిని పూర్తి స్దాయిలో ఇన్ వాల్వ్ చేసిన సంగతి అందరూ చూస్తున్నదే. తాజాగా ఓ ప్రతిష్టాత్మక దేవాలయ గోపురం నిర్మాణ బాద్యతలను మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కు అప్పగించటం గమనార్హం. చూడబోతే ప్రభుత్వాన్ని కూడా సిని దర్శకులే నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయ్.

విజయవాడ సమీపంలోని ఇబ్రహింపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద దశావతారాల అంశంతో ఆలయ శిఖరాన్ని ప్రభుత్వం భారీగా నిర్మించాలని అనుకున్నది. దానికి బోయపాటి డిజైన్లను ఇచ్చారు. గురువారం జరిగిన సిఆర్డిఏ సమావేశంలో ఆ ఆకృతులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.

నిజానికి ఆలయాలను నిర్మించాలంటే అందుకు ప్రత్యేకంగా స్ధపతులుంటారు. ప్రభుత్వంలోని దేవాదాయశాఖ ఈ విషయాలను చూసుకుంటుంది. కానీ చంద్రబాబు వ్యవహారం మొత్తం రివర్స్ కదా? అందుకనే సినీ దర్శకుడు బోయపాటిని మాట్లాడుకున్నారు. బోయపాటి-చంద్రబాబు మధ్య సంబంధాలు అందరికీ తెలిసినవే. ఇదే విషయమై బోయపాటి మాట్లాడుతూ, గోపుర నిర్మాణం ఐకానిక్ గా ఉండాలని సిఎం సూచించినట్లు తెలిపారు. ప్రాచీన దేవాలయ భవనాల నిర్మాణాల రీతుల్ని దృష్టిలో పెట్టుకుని ఆకృతులను రూపొందించినట్లు బోయపాటి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu