చిన్నపిల్లాడైపోయిన చంద్రబాబు

Published : Jan 13, 2017, 09:27 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
చిన్నపిల్లాడైపోయిన చంద్రబాబు

సారాంశం

రోజుకు 18 గంటలు బిజీగా గడిపే చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా బాల్య స్మృతులను నెమరేసుకున్నారు.

రోజుకు 18 గంటలు బిజీగా గడిపే చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా బాల్య స్మృతులను నెమరేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంక్రాంతి పండుత సందర్భంగా గాలి పటాలు ఎగురవేసారు. బొంగరాలు తిప్పారు. బిళ్లాంకోడి ఆడారు. చివరకు గోలీలు కూడా విసిరారు.

 

ఇదంతా  ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ సంబరాలను ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగానే సిఎంతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఆ సందర్భంగానే చంద్రబాబు పలు స్టాళ్ళను సందర్శించారు.

 

మైదానంలో తిరుగుతున్న చంద్రబాబుకు పలుచోట్ల బొంగరాలు, గాలిపటాలు ఎగురవేయటం, బిళ్లాంకోడి, గోలీలాడటం కనబడింది. దాంతో కొంతసేపు సిఎం కూడా చిన్న పిల్లాడైపోయారు. వెంటనే తాను కూడా బొంగరాలాడారు. గోలీలు గురిచూసి కొట్టారు. బిళ్లాంకోడి ఆడటంతో పాటు గాలిపటాలను ఎగరువేసారు. దాంతో అక్కడ కొద్ది సేపు సందడిగా గడిపారు. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?