హైదరాబాద్ లో మీటింగా... వెళ్లొద్దండి

First Published Dec 22, 2016, 3:47 AM IST
Highlights

పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లు హైదరాబాద్ లో పెడితే వెళ్లొదని అధికార్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు

 

ఆంధ్రప్రదేశ్  ముందు ముందు  హైదరాబాద్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు.

 

దీనితో  ఆంధ్రప్రదేశ్ అధికారులు హైదరాబాద్ సందర్శించాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఖర్చు తగ్గుతుంది. 

 

 ఇకనుంచి పార్లమెంటరీ కమిటీల సమావేశాలు  తాత్కాలిక రాజధాని విజయవాడలో జరపాల్సిందేనని ముఖ్యమంత్రి తెేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంటు దృష్టికి కూడా తీసుకుపోతున్నారు. అంతేకాదు, హైదరాబాద్ లో పార్లమెంటరీ కమిటీల సమావేశాలు పెడితే వెళ్లాల్సిన అవసరం లేదని కూడా ఆయన అధికారులకు చెప్పారు

 

ఈ వ్యవహారం  నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చకు వచ్చింది.

 

పార్లమెంటరీ కమిటీలు రాష్ట్రాలనుసందర్శించినపుడు రాష్ట్ర రాజధానిలోనే సమావేశాలు ఏర్పాటు చేస్తారు.  అధికారులు సమావేశానికి వెళ్లి కేంద్రపథకాలసమాచారం అందివాల్సి ఉంటుంది.  అయితే, ఆంధ్రకు ఇంకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి పార్లమెంటరీ కమిటీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరుగుతున్నారు.  దీనికి తక్షణం ముగింపు  పలికి ఆంధ్రప్రదేశ్ సందర్శించినపుడుసమావేశాలు  విజయవాడలోనే జరపాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఏ పార్లమెంటరీ కమిటీ సమావేశాలైనా ఏపీలోనే పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకోరారు.  హైదరాబాద్‌లో పెట్టి రమ్మంటే వెళ్లవద్దని కార్యదర్శులను ఆదేశించారు.

 

 

click me!