రాబోయే ఏడాదే కీలకం

Published : Jul 18, 2017, 04:25 PM ISTUpdated : Mar 24, 2018, 12:07 PM IST
రాబోయే ఏడాదే కీలకం

సారాంశం

వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాలన్నీ ఏడాదిలోపు పూర్తిచేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్టు చెప్పారు.

రాబోయే ఏడాది అత్యంత కీలకమని, ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలే తిప్పికొట్టేలా ప్రజా ప్రతినిధులంతా ఏకమై ముందుకుసాగాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం అమరావతిలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాలన్నీ ఏడాదిలోపు పూర్తిచేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 30 వరకు ఇంటింటికీ తెదేపా కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని సూచించారు.

అధికారంలో ఉన్నామనే స్పృహతో నేతల్లో ఎల్లవేళలా  కష్టపడాలని గట్టిగా చెప్పారు. భేషజాలు వదులుకొని బృంద స్ఫూర్తితో పనిచేసి ప్రజాదరణను పొందాలన్నారు. పెన్షన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణం, ఇళ్ళ స్ధలాలు తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటూ ఆదేశించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

 

 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu