ఒట్టు..నంద్యాల అభివృద్ది ఎన్నికల కోసం కాదట

Published : Jul 23, 2017, 08:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఒట్టు..నంద్యాల అభివృద్ది ఎన్నికల కోసం కాదట

సారాంశం

ఉపఎన్నికల ముందు ఒక్కసారిగా చంద్రబాబుకు నంద్యాలలో అభివృద్ధి గుర్తుకు వచ్చేసింది. మూడేళ్ళుగా నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న మాట వాస్తవం. వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని బలవంతంగా టిడిపిలోకి లాక్కున్నది విషయం అందరికీ తెలిసిందే.  టిడిపిలో ఉన్నంతకాలం భూమాను రకాలుగా వేధించారు. చివరకు రౌడీషీటర్ తెరిచారు. తాను పార్టీ మారినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదని వాపోయిన విషయమూ అందరికీ తెలిసిందే.

ఒట్టు..‘ఎన్నికల కోసం నంద్యాలను అభివృద్ధి చేయటం లేదు.. చేసే అభివృద్ధి పేద ప్రజల కోసమే’. నిజమేనా..చంద్రబాబునాయుడు చెబుతున్నారు కాబట్టి నమ్మాలి. ఉపఎన్నికల ముందు ఒక్కసారిగా చంద్రబాబుకు నంద్యాలలో అభివృద్ధి గుర్తుకు వచ్చేసింది. మూడేళ్ళుగా నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న మాట వాస్తవం. చివరకు అభివృద్ధిపనులు జరగాలంటే ప్రతిపక్షంలో ఉంటే కుదరదు అని స్పష్టంగా సంకేతాలను పంపి 21 మంది వైసీపీ ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రత్సోహించిన చరిత్ర చంద్రబాబుది. అందులో భాగమే వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని బలవంతంగా టిడిపిలోకి లాక్కున్నది విషయం అందరికీ తెలిసిందే.

టిడిపిలో ఉన్నంతకాలం భూమాను రకాలుగా వేధించారు. చివరకు రౌడీషీటర్ తెరిచారు. ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఆఖరకు అనారోగ్యంతో ఉంటే అరెస్టు వారెంటు జారీ చేయటానికి పోలీసులను ఆసుపత్రికి కూడా పంపిన ఘనమైన చరిత్ర చంద్రబాబుది. ఎలాగైతేనేమి రాచిరంపాన పెట్టి వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించే పరిస్ధితులు సృష్టించారు. వేరే దారిలేక భూమా చివరకు టిడిపిలో చేరారు.

సరే, ఓసారి ఫిరాయించిన తర్వాత పదవుల కోసమో, లేక తాయిలాలకు ఆశపడే తాను టిడిపిలో చేరానని ఎవరు చెప్పుకోలేరు కదా? అందుకే భూమా కూడా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు చెప్పుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత తాను పార్టీ మారినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదని వాపోయిన విషయమూ అందరికీ తెలిసిందే. అంటే భూమా మరణించే వరకూ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదన్నది వాస్తవం. అందరికీ తెలిసిన విషయం. భూమా హటాత్తుగా మరణించిన తర్వాత ఉపఎన్నికలో పోటీ అనివార్యమని తేలిన తర్వాతే చంద్రబాబుకు నంద్యాల అభివృద్ధి ఒక్కసారిగా గుర్తుకువచ్చింది.

ఉపఎన్నిక తప్పదని తేలిందగ్గర నుండి నియోజకవర్గంలో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు అందరూ చూస్తున్నదే. ఇంత హడావుడి చేస్తున్నా టిడిపి అభ్యర్ధి గెలుస్తారా అంటే నమ్మకం లేదు. జిల్లా నేతలను కాకుండా పదిమంది మంత్రులు, 25 మంది ఎంఎల్ఏ, 5 ఎంఎల్సీలను రంగంలోకి దింపారంటేనే గెలుపుపై ఎంతగా ఆందోళనలో ఉన్నారో స్పష్టమవుతోంది. అందుకనే, నియోజకవర్గంలో ఎక్కడబడితే అక్కడ వేలంపాట పద్దతిలో ఎవరికేం కావాలో కనుక్కుని మరీ అభివృద్దికి శంకుస్ధాపన చేస్తున్నారు. పైగా తాను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయటం లేదని అంటున్నారంటే ఎవరైనా నమ్ముతారా ?

PREV
click me!

Recommended Stories

YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu