ఎవ్వరినీ వదిలిపెట్టటం లేదు....

Published : Apr 18, 2017, 03:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఎవ్వరినీ వదిలిపెట్టటం లేదు....

సారాంశం

చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టటం లేదు. ప్రభుత్వ పథకాలను చంద్రబాబునాయుడు బాగానే పార్టీకి వాడుకుంటున్నారు.

చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టటం లేదు. ప్రభుత్వ పథకాలను చంద్రబాబునాయుడు బాగానే పార్టీకి వాడుకుంటున్నారు. ‘బడికొస్తా’ కార్యక్రమంలో పాఠశాల విద్యార్ధినులకు ముఖ్యమంత్రి సైకిళ్ళు పంపిణీ చేసారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఇపుడు బాగా చదువుకుని ఓటుహక్కు వచ్చినపుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా సైకిళ్ళు తీసుకున్న వాళ్ళంతా తమ తల్లి, దండ్రులతో చెప్పి టిడిపికి ఓట్లు వేయించాలని చెప్పటం మరింత విడ్డూరంగా ఉంది.

తాను పాల్గొనే కార్యక్రమంలో ఏమో విద్యార్ధులు ఎక్కువగా పాల్గొనాలి. తల్లి, దండ్రులకు కూడా చెప్పి ఓట్లు వేయించాలని చెబుతుంటారు. ప్రత్యేకహోదా కోసం జగన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యే విద్యార్ధులపైన మాత్రం కేసులు పెడతామంటూ బెదిరిస్తుండటం విచిత్రంగా ఉంది.

జగన్ కార్యక్రమాలకు విద్యార్ధులు ఎవ్వరూ హాజరుకావద్దని, విద్యార్ధులను పంపవద్దని స్వయంగా ప్రభుత్వమే కళాశాల యాజమాన్యాలను ఆదేశిస్తున్నది. గుంటూరులో జరిగిన యువభేరి కార్యక్రమంలో పాల్గన్న ఓ విద్యార్ధిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేయటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే, తర్వాత విద్యార్ధి సంఘాల నుండి వచ్చి ఒత్తిళ్ళను తట్టుకోలేక సస్పెన్షన్ను ఉపసంహరించుకోవటం వేరే సంగతి. మొత్తం మీద చంద్రబాబు ఓటు ఉన్న వారిని లేని వారిని అన్న తేడా లేకుండా అందరినీ ఫుల్లుగా వాడేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: చంద్రబాబు స్వామి వారిమీదనే దాడిచేసాడు : భూమన ఫైర్ | Asianet News Telugu
Lakshmi Parvathi Pressmeet: చంద్రబబు పై రెచ్చిపోయిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu