
చంద్రబాబు సర్కారు ప్రధాన మీడియాను మేనేజ్ చేసినట్లు సోషల్ మీడియాను మానేజ్ చేయలేకపోతోందా..?
గోదావరి పుష్కరాల మృతల సంఖ్య నుంచి మొదలు పెడితే బికాంలో ఫిజిక్స్ వరకు సర్కారు వైఫల్యాలు, టీడీపీ నేతల తెలివితేటలను సోషల్ మీడియాలో నెటిజన్లు ఉతికి ఆరేసిన నేపథ్యంలోఇక ఎంత మాత్రం సోషల్ మీడియా లో వచ్చే వ్యతిరేక వార్తలను సహించేది లేదని అధికార పార్టీ నిర్ణయించిదా..? అంటే.. ఓ తమిళ దినపత్రిక మాత్రం అవుననే అంటోంది.
ప్రభుత్వంపై పుకార్లు సృష్టించి అపఖ్యాతి పాలు చేస్తున్న సోషల్ మీడియాకు కళ్లెం వేసేందుకు ఐటీ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ఒక కొత్త వ్యూహాన్ని పన్నారని దినమలర్ అనే ఓ తమిళ పత్రిక బయటపెట్టింది.
అమరావతి డేట్ లైన్ తో వచ్చిన ఈ కథనం ప్రకారం నారా లోకేష్ సోషల్ మీడియాను అదపులో పెట్టే విషయంపై తన సన్నిహితులతో చర్చించారట. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవైనా పోస్టులు పెడితే వారిని జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుకార్లు సృష్టించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడకూడదని నారా లోకేశ్ భావిస్తున్నారని ఆ పత్రిక కథనం పేర్కొంది.
నిజంగా ఇలాంటి చర్యలకు ఏపీ ప్రభుత్వం పాల్పడితే సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారే కాదు అన్యాయాన్ని ప్రశ్నించేవారు, ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపట్టేవారు జైలుకెళ్లకతప్పదు.