మొదటి మీటింగులోనే ఠారెత్తించిన అఖిల ప్రియ

First Published Apr 17, 2017, 11:40 AM IST
Highlights

రాజకీయాల ప్రకారం కాదు, చట్టం ప్రకారం పనిచేయాలని చాలా విలువయిన సలహా సీనియర్ అధికారులకు చెప్పి చెమటలు పట్టించింది

మొదటి సారి ఎమ్మెల్యే. వెంటనే మంత్రి. అయినా సరే, టూరిజం శాఖ మంత్రి అఖిల ప్రియ అధికారులకు తనేవెరో తెలిసొచ్చేలా మొదటి జిల్లాస్థాయి రివ్యూ మీటింగులో నే చేసింది.

 

రాజకీయాల  ప్రకారం కాదు, చట్టం ప్రకారం పనిచేయాలని చాలా విలువయిన సలహా సీనియర్ అధికారులకు చెప్పి, చెమటలు పట్టించింది.  ఈసంఘటన అధివారం నాడు కర్నూలులో జరిగిన ఒక సమావేశంలో ఎదురయింది. 

 

ఇదెలా జరిగిందంటే...

 

భూమా నాగిరెడ్డికి మద్దతుగా నిలిచిన గ్రామాలలో మంచినీళ్లు సరఫార కాకుండాచ కొతపల్లి సర్పంచ్ చాకలి పేట, దూదేకుల పేటలకు ఏకంగా పైపులైన్‌ కట్‌ చేసిన విషయం నిన్న జరిగినసమావేశంలో చర్చకు వచ్చింది. నిజానికి దీని మీద బతికున్నపుడు నాగిరెడ్డియే ఫిర్యాదు చేశారు. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

 

దీంతో రభస. పర్యాటక మంత్రి అఖిల ప్రియ దాకా వచ్చింది. సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

 

 సర్పంచ్ ఎలా పైప్ లైన్ కట్ చేస్తారని ఆమె అధికారులను ప్రశ్నించారు.

 

సర్పంచ్‌ పైప్‌లైన్‌ కట్‌చేస్తే..మీరేం చేస్తున్నారు?

 

అయితే, సమాధానమే కొంచెం తలతిక్కగా ఉంది.

 

దీనికి పంచాయతీ రాజ్ ఈఈ స్పందించారు. సమాధానమే ప్రజాస్వామ్యం సిగ్గపడేలా ఉంటుంది.

 

 సర్పంచు పైప్‌లైన్‌ కట్‌ చేయడం వెనుక రాజకీయ సమస్య ఉందని ఆయన చెప్పారు.

 

‘మీరు చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా..? లేక రాజకీయ ఉద్యోగం చేస్తున్నారా? ’ అఖిల ప్రియ మండిపడ్డారు.సర్పంచి చెక్ పవర్ రద్దు చేయాలని ఆమె కలెక్టర్ కు సూచనలిచ్చారు.

 

నంద్యాల పట్టణంలో నీటి. అదే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలంలో ట్యాంకర్లతో సరఫరా చేసిన నీటికి బిల్లులు ఇంకా ఎందుకు చెల్లించలేదని అడిగారు.

 

పక్కనే ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని  సర్పంచ్ రాజకీయ కారణాలతో నీటి సరఫరా నిలిపేస్తే అధికారులు ఏం చేస్తున్నారని దబాయించారు.

 

మంత్రి కి మద్దతుగా రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం కావాలని ఆయన అధికారులకు సూచించారు.

 

click me!