కమీషన్లపైనే చంద్రబాబుకు ప్రేమ

First Published May 19, 2017, 6:47 PM IST
Highlights

వైఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయినా చంద్రబాబు మిగిలిన పనులను పూర్తి చేయక పోవటానికి కారణం రైతులపై ప్రేమ లేకపోవటమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు రైతులమీదకన్నా కమీషన్ల మీదే ప్రేమ కాబట్టి బ్యాలన్స్ రూ. 54 కోట్లను రూ. 400 కోట్లకు పెంచేసినట్లు ఆరోపించారు.

చంద్రబాబునాయుడుకు రైతుల మీదకన్నా కమీషన్లపైనే ప్రేమ ఎక్కువ అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో జగన్ పర్యటించారు. మండల కేంద్రంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన వంశధారా ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఇప్పుడు కూడా పూర్తి చేయలేకపోయారంటూ మండిపడ్డారు.

వైఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయినా చంద్రబాబు మిగిలిన పనులను పూర్తి చేయక పోవటానికి కారణం రైతులపై ప్రేమ లేకపోవటమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు రైతులమీదకన్నా కమీషన్ల మీదే ప్రేమ కాబట్టి బ్యాలన్స్ రూ. 54 కోట్లను రూ. 400 కోట్లకు పెంచేసినట్లు ఆరోపించారు. చంద్రబాబు బినామీ సిఎం రమేష్ ఆ పనులు చేస్తున్నట్లు కూడా చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రం అప్పు రూ. 94 వేల కోట్లైతే మూడేళ్ళల్లో ఆ అప్పును రూ. 2.16 లక్షల కోట్లకు పెంచారంటూ మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు బడ్జెట్ ను మించిపోయినట్లు ఎద్దేవా చేసారు. వేదిక మీద నుండి ప్రాజెక్టు నిర్వాసితులతో జగన్ మాట్లాడించారు. తాము పడుతున్న అవస్తలను నిర్వాసితులు వేదిక మీదనుండి ఏకరువుపెట్టారు.

click me!