ఆస్తుల విభజనపై కోర్టుకు వెళ్ళాల్సిందే

First Published May 19, 2017, 5:04 PM IST
Highlights

కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల పంపిణీపై ఏపికి నష్టం వాటిల్లిందని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాయాలని సరైన స్పందన రాకపోతే కోర్టుకు వెళ్లాలని సిఎం ఉన్నతాధికారులకు స్పష్టం చేసారు.

సమైక్య రాష్ట్ర విభజన సందర్భంగా ఏపికి రావాల్సిన ఆస్తుల పంపిణీతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన అనంతరం ఆస్తుల పంపిణీ తదితర సమస్యలపై చంద్రబాబునాయుడు ఈరోజు సమీక్షించారు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల పంపిణీపై ఏపికి నష్టం వాటిల్లిందని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాయాలని సరైన స్పందన రాకపోతే కోర్టుకు వెళ్లాలని సిఎం ఉన్నతాధికారులకు స్పష్టం చేసారు.

ఉన్నతవిద్యా మండలి విషయంలో సుప్రిం తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని సమావేశం అభిప్రాయపడింది. తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని లేఖ రాయాలని కూడా సిఎం చెప్పారు. ఒకవేళ హోంశాఖ గనుక సానుకూలంగా లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సిందేనని నిర్ణయించారు. 9, 10వ షెడ్యూల్లోని సంస్ధలు, యూనివర్సిటీల సమస్యలు ఇంకా పరిష్కారం కావాలని సమావేశంలో తేలింది. సెక్షన్ 108ని మరో రెండేళ్ళు పెంచాలని కేంద్రాన్ని కోరాలని సమావేశం అభిప్రాయపడింది.

జూన్ నెలలో ఢిల్లీకి వెళ్లి అక్కడి అధికారులను కలవాలని కూడా సిఎం ఆదేశించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా సరే రాష్ట్రప్రయోజనాలు కాపాడాలంటూ సిఎం స్పష్టం చేసారు. కుదరంటే, సుప్రింకోర్టును ఆశ్రయించాలని కూడా చంద్రబాబు చెప్పటం గమనార్హం. అంతా బాగానే ఉంది కానీ మరి విభజన చట్టంలోనే పేర్కొన్న రెవిన్యూలోటు భర్తీ, ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశాలపై మాత్రం చంద్రన్న ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేకహోదా అంటే ముగిసిన అధ్యాయమని కేంద్రం ప్రకటించింది. మరి ప్రత్యేక రైల్వేజోన్, రెవిన్యూలోటు భర్తీ లాంటి విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదు?

click me!