
వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని టిడిపి ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ బెదిరిస్తున్నారు. భూములు తమకు కాకుండా అడ్డుపడిన ఆర్కెపై తన అక్కసంతా వెళ్ళగక్కుతున్నారు. తమిళనాడులోని సత్రం భూములను అప్పనంగా తమకు నమ్మినబంటైన కాపుకార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు చంద్రబాబునాయుడు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. వందల కోట్లు విలువైన 84 ఎకరాలను కేవలం ఛైర్మన్ కు చంద్రబాబు రూ. 22 కోట్లకే కట్టబెట్టేసారు. విషయం వెలుగు చూడగానే ఆళ్ళ కోర్టును ఆశ్రయించారు. దాంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.
ఎప్పుడైతే కోర్టు జోక్యం చేసుకుందో భూములు ఛైర్మన్ చేజారిపోయాయి. పైగా రూ. 5 కోట్లు ఎక్కవ ధరిచ్చి సదరు భూములను మీరుకానీ మీ తరపున ఎవరైనా కొనచ్చని కోర్టు చెప్పింది. దాంతో సదరు భూములు కొనటానికి ఆళ్ళ సిద్ధపడ్డారు. మొత్తం 84 ఎకరాలను ప్రభుత్వం ఇపుడు ఆళ్ళకు రిజిస్టర్ చేయక తప్పలేదు. దాంతో సదావర్తి సత్రం భూములు చేజారిపోయిన దెబ్బ లోకేష్ మీద బాగానే పడింది. భూములు దక్కకుండా అడ్డుపడిన వైసీపీ ఎంఎల్ఏపైన లోకేష్ అక్కసంతా చూపుతున్నారు.
భూములు కొంటే ఆళ్ళపై ఐటికి ఫిర్యాదు చేస్తానని చెప్పటంలోనే లోకేష్ తెలివంతా బయటపడుతోంది. రూ 27 కోట్లు వ్యయం చేస్తున్న ఆళ్ళపై ఐటి దాడులు చేయిస్తానని చెప్పటం లోకేష్ అపరిపక్వతనే బయటపెట్టింది. ఇక్కడే లోకేష్ వైసీపీ ఎంఎల్ఏకి అడ్డంగా దొరికిపోయారు. రూ. 27 కోట్లు వ్యయం చేస్తున్న తనపై ఐటి దాడులు చేయిస్తానని చెబుతున్న లోకేష్ మరి, రూ. 22 కోట్లు చెల్లించిన రామానుజయ్యపై ఎందుకు ఐటి దాడులు చేయించలేదన్న ఆళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అలాగే, ఓటుకునోటు కేసులో స్టీఫెన్ సన్ కు రూ. 5 కోట్లు చెల్లించిన వారిపై ఐటికి ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ఆళ్ళ ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు.