త్వరలో పాదయాత్ర ?

First Published Jul 7, 2017, 7:59 AM IST
Highlights

వైఎస్ అయినా, చంద్రబాబైనా పాదయాత్రల చేసిన తర్వాతే ముఖ్యమంత్రులయ్యారు. అంటే, ఎన్నికలకు ముందు పాదయాత్రలనేవి ఓ సెంటిమెంటుగా మారిందన్న విషయం అర్ధమవుతోంది. కాబట్టే, జగన్ కూడా అదే సెంటిమెంటును ఫాలో అవుదామని అనుకున్నట్లున్నారు.

అధికార సాధన కోసం త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపడతారా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. 2004లో అధికారం అందుకునే ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రంగారెడ్డి జిల్లా లోని చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ పాదయాత్ర జరిపిన సంగతి గుర్తుందికదా? అటువంటి పాదయాత్రనే తాను కూడా చేయాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ జగన్ ఓదార్పుయాత్ర అని, అదని ఇదని చాలా యాత్రలే చేసారు. అయితే, అధికార సాధనకు అవేవీ సరిపోవని భావిస్తున్నారట. అందుకనే పాదయాత్ర చేసే విషాయమై ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికి భారీ పాదయాత్రలు మూడు జరిగాయి. మొదటిది వైఎస్ చేయగా, రెండో పాదయాత్ర చంద్రబాబునాయుడు చేసారు. ఇక మూడోది జగన్ సోదరి షర్మిల చేసారు. వీరు కాకుండా కొద్దిమంది స్ధానిక నేతలు కూడా తమ జిల్లాల్లో పాదయాత్రలు జరిపారు. వైఎస్ అయినా, చంద్రబాబైనా పాదయాత్రల చేసిన తర్వాతే ముఖ్యమంత్రులయ్యారు. అంటే, ఎన్నికలకు ముందు పాదయాత్రలనేవి ఓ సెంటిమెంటుగా మారిందన్న విషయం అర్ధమవుతోంది. కాబట్టే, జగన్ కూడా అదే సెంటిమెంటును ఫాలో అవుదామని అనుకున్నట్లున్నారు.

ఇప్పటి వరకూ చేసిన యాత్రలు ఓ ఎత్తు, చేయాలనుకుంటున్న పాదయాత్ర ఓ ఎత్తవతుంది. నిజంగానే ఓ నేత పాదయాత్ర చేస్తే ప్రత్యక్షంగా అనేకమందిని కలిసే అవకాశం వస్తుంది. చాలాచోట్ల గ్రామస్తులు కూడా నేతలతో నడుస్తారు. అప్పుడు స్ధానిక  సమస్యలను దగ్గర నుండి చూసే అవకాశం వస్తుంది. అందుకనే వైఎస్ అయినా చంద్రబాబైనా పాదయాత్రలను ఎంచుకున్నారు. సో అదే దారిలో జగన్ కూడా ఆలోచిస్తున్నారన్నమాట. రూటు తదితరాలపై సీరియస్ గా ఆలోచిస్తున్నారట. ముహూర్తం ఎప్పుడన్నది బహుశా ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయమవుతుందేమో.

click me!