పోలవరం కాంట్రాక్టర్ ని మారుస్తారట

Published : Sep 14, 2017, 07:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పోలవరం కాంట్రాక్టర్ ని మారుస్తారట

సారాంశం

పోలవరం కాంట్రాక్టర్ ను మారుస్తాం. అమరావతి శంకుస్థాపన  డిజైన్లు ఖరారయ్యాకే  

పోలవరం ప్రాజెక్టు విషయలో కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ కి నోటిసు ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.ప్రతి సోమవారం నాడు ఆయన పోలవరం ప్రాజక్టును వర్చువల్ రివ్యూచేస్తూ వచ్చారు. పోలవరం పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. 29018 నాటికి పూర్తవుతుందని కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఈ మధ్య ఏంజరిగిందో ఏమో   రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అనే రష్యన్ కంపెనీకి నోటీసుల లిచ్చారు. నిజానికి పోలవరం కడుతున్నదెవరో కాదు, టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావే.

అయితే, రోజు మాత్రం ఆయన ఇక్కడి కాంట్రాక్టర్ పేరెత్తకుండా ప్రాజెక్టు పనులు వేరే వారికి అప్పగించే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.

వేరే వారికి పనులు అప్పగించిన న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందట వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అమరావతి శంకుస్థాపన  వాయిదా?

తర్వాత అమరావతి అకృతులు పైనల్ కాలేదు కాబట్టి శంఖుస్దాపన చెయ్యటం సభబుకాదు అని అన్నారు. నిజానికి దసరా రోజు అమరావతి పాలనా భవనాలకు శంకస్థాపన చేయాల్సి ఉండింది. నిన్న  డిజైనర్ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన  డిజైన్లు ఆయన నచ్చ లేదు.  అందువల్ల శంకుస్థాపన చేయడం సబబు కాదని అన్నారు.

డిజైన్ల గురించి ఆయన అన్న మాటలు:

‘‘అమరావతి డిజైన్ లు చూసాం.ఇంకా కోన్ని మార్పులు సూచించాం. మూడు ప్రాజెక్టు లు డిజైన్ లు అద్భుతంగా ఉండేల చూస్తున్నాం. రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ కదా అయన సలహ కూడా అడుగుతున్నాము
రాజదాని కమీటిలో కూడా మంచి డిజైన్ లు సూచించేవారు ఉన్నారు వారి కూడా సంప్రదించి పైనల్ చేస్తాం.ప్రపంచంలో నెంబర్ ఒన్ డిజైన్ ఉండలి అనేది మా అకాంక్ష.ప్రపంచంలో ది బెస్ట్ గా ఉండాలి అందులో రాజీ లేదు అవసరమైతే నేనుకూడా వేళ్తాను (లండన్ కు).’’ 

PREV
click me!

Recommended Stories

జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై దుష్ప్రచారం క్లారిటీ ఇచ్చిన తల్లి | Janasena | Asianet News Telugu
Weather Report: ఇక కాస్కోండి.. ఒక్క‌సారిగా మారుతోన్న వాతావ‌ర‌ణం.