ఆంధ్రా గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు

First Published Sep 14, 2017, 4:26 PM IST
Highlights

సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేసే కాంట్రక్టు ఉద్యోగుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

 

 

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించారు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ  మంత్రి నక్కా ఆనంద్ బాబు .

సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేసే కాంట్రక్టు ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నామని ఆయన వెల్లడించారు.

పీజీ చదివిన ఉపాధ్యాయులకు ప్రస్తుతం 16150 గా ఉన్న వేతనాన్ని 24225 రూ పెంచుతున్నామని, పీజీ చదవని ఉపాధ్యాయులకు 14860 రూ గా ఉన్న వేతనాన్ని 22290 రూ గా పెంచుతున్నామని ఆయన చెప్పారు..

మరిన్ని వివరాలు: 

పిఇటి లకు 10900 రూ గా ఉన్న వేతనాన్ని 16350  లకు పెరుగుతంది.

స్టాఫ్ నర్స్ లకు 11530 నుండి 17295 లకుపెంపు.

క్వాలిఫై కానీ స్టాఫ్ నర్స్ లకు 9200 నుండి 13800 కి పెంపు.

లైబ్రరీయన్ లకు 13660 నుండి 20490 గాపెంపు.

తాజా నిర్ణయం వల్ల 1112 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది.

దీని వల్ల ప్రభుత్వం పై ఏటా అదనంగా 9కోట్ల26లక్షల30వేల780రూపాయలు  అదనంగా భారం పడుతుందని మంత్రి చెప్పారు.

click me!