చంద్రబాబు మామూలుగా రెచ్చిపోలేదుగా...

First Published Aug 28, 2017, 6:52 PM IST
Highlights
  • నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత చంద్రబాబునాయకుడు కూడా  రెచ్చిపోయారు.
  • ప్రస్తావన ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలైతే, చంద్రబాబు మాట్లాడింది వైసీపీ ఎంపిల గురించి.
  • ఉత్తమ విలువల గురించి, విశ్వసనీయత గురించి, అనుభవం గురించి తన భుజాన్ని తానే చరుచుకుంటూ ఎన్నో మాట్లాడారు.
  • అదే సమయంలో  జగన్ను ఎద్దేవా చేసి మాట్లాడారు లేండి.
  • ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రం ఇపుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు జగనే కారణమని తేల్చిపారేసారు.

ఎక్కడైనా గానీ విజేతలే రెచ్చిపోతుంటారు. ఎందుకంటే, పరాజితుల మాటలను ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి. నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత చంద్రబాబునాయకుడు కూడా  రెచ్చిపోయారు. అందులో మచ్చుకి కొన్ని. ఎవరైనా సభ్యుడు చనిపోతే ఆ నియోజకవర్గంలో పోటీ పెట్టకూడదని టిడిపి అనుకున్నదట. అంత వరకూ బాగానే ఉంది. ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఉపఎన్నికనే చంద్రబాబు ఉదాహరణగా చూపారు.

నిజానికి 2014లో ఆళ్ళగడ్డలో వైసీపీ అభ్యర్ధిగా శోభా నాగిరెడ్డి పోటీ చేసింది. అయితే, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు పోలింగ్ ముందే. అదే విషయాన్ని చంద్రబాబు ఇపుడు ప్రస్తావించారు.  సరే, పోటీ పెట్టినా గెలిచే అవకాశం లేదన్నది వేరే విషయం.

కానీ నంద్యాలలో జరిగిందేంటి? భూమా నాగిరెడ్డి వైసీపీ ఎంఎల్ఏ అన్న విషయం అందరకీ తెలిసిందే. కానీ చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టిడిపిలోకి ఫిరాయించారు. అయితే, హటాత్తుగా మరణించటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నిజంగా చంద్రబాబు సంప్రదాయాలను పాటించే వ్యక్తే అయితే పోటీ నుండి తప్పుకోవాల్సింది టిడిపినే. కానీ రివర్స్ లో చెప్పటం చంద్రబాబుకే చెల్లింది.

అదే విధంగా మిగిలిన 20 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలతో కూడా రాజీనామాలు చేయించి ఉపఎన్నికల్లో గెలిస్తే అప్పుడు రెఫరెండంగా అంగీకరిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా సవాలు విసిరారు. అదే విషయాన్ని మీడియా చంద్రబాబు వద్ద ప్రస్తావించింది. జూన్ లోగా ప్రత్యేకహోదా రాకపోతే ఎంపిలతో రాజీనామా చేయిస్తానని చెప్పారు కదా? ముందు ఎంపిలతో రాజీనామా చేయించమనండి అంటూ రివర్స్ లో మాట్లాడారు. అంటే ప్రస్తావన ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలైతే, చంద్రబాబు మాట్లాడింది వైసీపీ ఎంపిల గురించి.

ఉత్తమ విలువల గురించి, విశ్వసనీయత గురించి, అనుభవం గురించి తన భుజాన్ని తానే చరుచుకుంటూ ఎన్నో మాట్లాడారు. అదే సమయంలో  జగన్ను ఎద్దేవా చేసి మాట్లాడారు లేండి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రం ఇపుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు జగనే కారణమని తేల్చిపారేసారు.

ఉపఎన్నిక ప్రచారంలో జగన్ చంద్రబాబు గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. ఈరోజు జగన్ గురించి ఇన్ని మాటలు చెబుతున్న చంద్రబాబు ఫలితం గనుక తారుమారయ్యుంటే మీడియాతో అసలు మాట్లాడేవారేనా? టిడిపి గెలిచింది సరే. ఎలా గెలిచిందో దేశమంతా చూసింది. ఓడిపోయిన వైసీపీకి 70 వేల ఓట్లు రావటమంటే మామూలు విషయం కాదు. అందుకే విజేతల మాటలనే అందరూ వింటారు. పరాజితులది కాదు.

click me!