నంద్యాల్లో 12 మంది ఎంఎల్ఏలకు బాధ్యతలా?

Published : Jul 17, 2017, 12:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
నంద్యాల్లో 12 మంది ఎంఎల్ఏలకు బాధ్యతలా?

సారాంశం

నంద్యాల ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎంఎల్ఏలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూ ఏ ఎన్నిక కోసం కూడా చంద్రబాబు ఈ స్దాయిలో 12 మందిని నియమించలేదు.

చంద్రబాబునాయుడులో నంద్యాల కలవరం ఎక్కువైపోతోంది.  ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలవాలన్న పట్టుదలే చంద్రబాబుకు ఊపిరి ఆడకుండా చేస్తోందేమో. అందుకనే రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. నంద్యాల ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎంఎల్ఏలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూ ఏ ఎన్నిక కోసం కూడా చంద్రబాబు ఈ స్దాయిలో 12 మందిని నియమించలేదు. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు ఎంఎల్ఏలతో సచివాలయంలోని తన ఛాంబర్లో భేటీ అయ్యారు. కేవలం నంద్యాల ఉపఎన్నిక గురించే దాదాపు గంటకుపైగా చర్చించారు.

ఉపఎన్నికలో గెలవటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తర్వాత నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, బోడె ప్రసాద్ కాకుండా మరో తొమ్మిదిని నియమిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ 12 మంది ఎంఎల్ఏలను మండలానికి ముగ్గురు చొప్పున పనిచేయాలని ఆదేశించారు. ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఎంఎల్ఏలందరూ కార్యాచరణలోకి దిగాలంటూ చంద్రబాబు అందరినీ ఆదేశించారు. ఇప్పటికే అనేకమంత్రి మంత్రులు ప్రతిరోజు నంద్యాలో పర్యటిస్తున్నారు. వీరికి అదనంగా మళ్ళీ ఎంఎల్ఏలను నియమించారు. అవసరమైతే మరింతమంది ఎంపిలను కూడా రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట. ఇంతమందిని నియోజకవర్గంలోకి దింపితే జనాలు ఉక్కిరిబిక్కిరైపోరా?  

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu