
అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రేస్ సర్క్యూట్ ప్రకటించారు. విమానాశ్రయం ప్రకటించిన రెండురోజుల్లో నే అనంతపురానికి మరొకప్రాజక్టు ప్రకటించారునఅనంతపురం జిల్లాకు ఎఫ్ 3 రేసింగ్ సర్క్యూటు రానుందని ఆయన స్వయంగా ప్రకటించారు. తనకల్లు మండలం కోటపల్లిలో 3.2 కి.మీ పొడవైన రేసింగ్ ట్రాకుతో పాటు ఆటోమోటివ్ థీమ్ పార్కు, విలాసవంతమైన రిసార్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
మొత్తం మూడు దశలలో రూ. 149 కోట్లతో నిర్మించ తలపెట్టిన రిసార్టుతో 360 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ నుంచి పర్యాటకులను ఆకట్టుకునేలా 245 ఎకరాల పరిధిలో ‘నిధి మార్క్ వన్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దీని ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. 40 రూములతో రిసార్టు, గోల్ఫ్ కోర్సు, ఎమ్యూజ్‌మెంట్ పార్కు, హెలిప్యాడ్ ఈ ప్రాజెక్టులో భాగంగా వుంటాయి. ఏడాదిన్నరలోనే మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేస్తామని నిధి సంస్థ వెల్లడించింది. ఇక్కడ నిర్వహించే రేసులను ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది టీవీ వీక్షకులకు తిలకిస్తారు. భారతదేశంలో ఇప్పటివరకు చెన్నయ్, గ్రేటర్ నోయిడాలో మాత్రమే రేసింగ్ సర్క్యూట్లు వున్నాయి.
తిరుపతిలో అడుగుపెట్టిన ‘జూమ్ కార్స్’
తిరుపతిలో ట్రావెల్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిన జూమ్ కార్స్ సంస్థను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్వాగతించారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో సెల్ఫ్ డ్రైవ్ కారులను అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్న జూమ్ కార్స్ సంస్థ రాష్ట్రంలో మొత్తం 200 కారులను అందుబాటులో తీసుకొచ్చింది.
ఇదే విధంగా రాయలసీమ లోకి కోటలను కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక ముఖ్యమయిన పర్యాటక ప్రాంతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.