చంద్రబాబు-ఐజయ్య వాగ్వాదం

First Published Jun 21, 2017, 3:15 PM IST
Highlights

ఓ సభలో వైసిపి ఎంఎల్ఏ ఐజయ్య మాట్లాడిన మాటలతో చంద్రబాబుకు మంటపుట్టిది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంఎల్ఏ మాట్లాడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. దాంతో వేదిక మీద నుండే ఐజయ్యపై చంద్రబాబు మండిపడ్డారు. అంతేకకుండా ఎంఎల్ఏ మాట్లాడకుండా మైక్ కూడా కట్ చేయించారు.

కర్నూలు జిల్లా తంగడంచలో చంద్రబాబునాయుబు-వైసీపీ ఎంఎల్ఏ ఐజయ్యకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనే నిమ్మితం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చారు. అప్పుడు జరిగిన ఓ సభలో వైసిపి ఎంఎల్ఏ ఐజయ్య మాట్లాడిన మాటలతో చంద్రబాబుకు మంటపుట్టిది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంఎల్ఏ మాట్లాడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. దాంతో వేదిక మీద నుండే ఐజయ్యపై చంద్రబాబు మండిపడ్డారు. అంతేకకుండా ఎంఎల్ఏ మాట్లాడకుండా మైక్ కూడా కట్ చేయించారు.

తొలుత ఎంఎల్ఏ మాట్లాడుతూ, ప్రభుత్వం సేకరిస్తున్న భూములను ఏం చేస్తోందో అర్ధం కావటంలేదన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పటం లేదని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ కావాలని అడిగినా పట్టించుకోవటం లేదన్నారు. స్ధానిక ఎంఎల్ఏ అయిన తనకు కూడా సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించటంపై ఐజయ్య అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఎంఎల్ఏ ప్రసంగాన్ని గమనించిన చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగనిస్తే ఇంకా ఏం మాట్లాడుతారో అన్న ఆందోళనతో వెంటనే మైక్ లాగేసుకున్నారు.

ఇక, అక్కడి నుండి ఐజయ్యపై ధ్వజమెత్తటం మొదలుపెట్టారు చంద్రబాబు. ఇలాంటి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎంఎల్ఏలుగా ఉంటే ఈ ప్రాంతం ఎప్పటికీ అభివృద్ధి కాదన్నారు. వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంఎల్ఏకి హితవు పలికారు. ఇదే  విధమైన వాగ్వాదం గతంలో కూడా వీరిద్దరి మధ్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు తీరు చూసిన అధికారులు ఐజయ్యను అక్కడి నుండి పంపేసారు. 

 

click me!