ఇదేమి బ్లాక్ మైలింగ్ బాబుూ ....

First Published Jun 23, 2017, 9:06 AM IST
Highlights

చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే ఒక్కటి మాత్రం ఖాయంగా అర్ధమైపోతోంది. నంద్యాల ఉపఎన్నికలో టిడిపికి గెలిచేంత సీన్ లేదని. గెలుపు అవకాశం లేదు కాబట్టే జనాలతో అలా మాట్లాడుతున్నారు. అదేవిధంగా, ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు.

చంద్రబాబునాయుడులోని అపరిచితుడు క్యారెక్టర్ బయటపడుతోంది. రేషన్లంటూ, రోడ్లంటూ, ఫించన్లంటూ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సిఎంగా జనాలను ఓట్ల కోసం బహిరంగంగా బ్లాక్ మైలు చేయటం గతంలో ఎవ్వరూ చూడలేదు. నంద్యాల ఉపఎన్నిక విషయంలో వాస్తవ పరిస్ధితులపై అధ్యయనం చేసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయినట్లుంది. అందుకే జనాలతో తన నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. తానిచ్చిన ఫించన్లు తీసుకుంటూ, తానిచ్చిన రేషన్ తీసుకుంటూ, తానేసిన రోడ్లపై తిరుగుతూ తనకు ఓట్లేయరా? అంటూ ప్రశ్నించటమే అపరిచితుడి క్యారెక్టర్ కు నిదర్శనం.

అదే సమయంలో చంద్రబాబు పక్కనే ఉన్న ఓ నేత జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మీరంతా ఓ అబ్బకు, అమ్మకు పుట్టుంటే టిడిపికే ఓట్లు వేయాలి’ అన్నారు. అటువంటి నేతను అలా మాట్లాడకూడదని వారించాల్సిందిపోయి శభాష్ అంటూ మెచ్చుకోవటంతో జనాలతో పాటు నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అంటే చంద్రబాబు మనసులోని మాటలనే పక్కనే ఉన్న నేతతో చెప్పించినట్లైంది.

ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది. చంద్రబాబు రోడ్లు వేసినా, ఫించన్లు ఇచ్చిన్నా, రేషన్ ఇస్తున్నా అవేవీ తన సొంత జేబులో నుండి డబ్బు ఖర్చు చేస్తున్నవి కావు. ఏం చేసినా ప్రభుత్వ డబ్బుతోనే అంటే ప్రజలు పన్నుల ద్వారా చెల్లిస్తున్నడబ్బుతోనే చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నట్లే జరగాలంటే మరి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించిన రోడ్లపైన ఎలా తిరిగారు? ఇపుడు కూడా తెలంగాణా ప్రభుత్వం వేయించిన రోడ్లపైన హైదరాబాద్ లో ఎలా తిరుగుతున్నారు?

చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే ఒక్కటి మాత్రం ఖాయంగా అర్ధమైపోతోంది. నంద్యాల ఉపఎన్నికలో టిడిపికి గెలిచేంత సీన్ లేదని. గెలుపు అవకాశం లేదు కాబట్టే జనాలతో అలా మాట్లాడుతున్నారు. అదేవిధంగా, ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. చూద్దాం రాబోయే రోజుల్లో అపరచితుడు నుండి ఇంకెన్ని విచిత్రాలు చూడాలో?

click me!