విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

sivanagaprasad kodati |  
Published : Oct 07, 2018, 12:14 PM ISTUpdated : Oct 07, 2018, 12:53 PM IST
విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

సారాంశం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయం విశాఖ చేరుకుంది. అమెరికాలో ప్రభుత్వపరమైన అనుమతులు తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎయిర్ ఇండియా విమానం ద్వారా మూర్తి భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది.. అక్కడి నుంచి మరో విమానంలో విశాఖకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 

ప్రజల సందర్శనార్థం సిరిపురంలోని ఆయన స్వగృహాంలో ఉంచి ... అక్కడి నుంచి రామ్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయానికి తరలింస్తారు.. అనంతరం రుషికొండకు అంతిమయాత్ర నిర్వహించి.. గీతం యూనివర్సిటీ వెనుక ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎంవీవీఎస్ మూర్తికి నివాళులర్పించడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు విశాఖ చేరుకోనున్నారు.

అమెరికాలో ప్రఖ్యాత వైల్డ్‌లైఫ్ సఫారీని చూసేందుకు లాస్ ఏంజెల్స్ నుంచి మూర్తితో పాటు మరో నలుగురు కారులో బయలుదేరారు. అలస్కా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి, వీబీఆర్ చౌదరి, వెలవోలు బసవపున్నయ్య, శివప్రసాద్ దుర్మరణం పాలవ్వగా.. కడియాల వెంకట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  
 
అమెరికాలో మృతి: ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి ఎలా అయ్యారంటే...

టీడీపీకి షాక్: రోడ్డు ప్రమాదాల్లో నేతలను కోల్పోతున్న టీడీపీ

మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా

మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

PREV
click me!

Recommended Stories

గుర్తుపెట్టుకో నిన్ను వదలను అసెంబ్లీ నుంచి జగన్ కు వార్నింగ్ | CM Chandrababu Speech in Assembly
అసెంబ్లీలో జగన్ కి చెమటలు పట్టించిన చంద్రబాబు | CM Chandrababu Naidu speech in Assembly | Jagan